ఫోటోస్టోరీ: మీరెప్పుడైనా ఆ వాసన చూసారా..?

Update: 2020-04-01 02:30 GMT
'బెజవాడ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా తన నటన తో, అందాల ఆరబోతతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో 'నాయక్', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు మాత్రం రాలేదు. దీంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై దృష్టి పెట్టింది ఈ భామ‌. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళో చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సినిమా రఘువరన్ బిటెక్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అమ్మడు తెలుగు లో మాత్రం కనపడలేదు.

రీసెంట్ గా 'ఆమె' తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి పోయింది. సినిమాలలో సరిగ్గా కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటానంటుంది అమలాపాల్. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అమల పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు అమ్మడు పెద్ద సందేశం రాసిపెట్టింది. ఎప్పుడైనా మీరు పువ్వుల నుండి వచ్చే స్వచ్ఛమైన పరిమళాన్ని ఆస్వాదించారా అంటూ చమత్కారంగా పూల వాసన చూస్తున్న ఫోటో అప్లోడ్ చేసింది. ఇక నేచర్ గురించి పెద్ద స్టోరీ రాసింది కానీ అభిమానులు ఆమె చెక్కిళ్ళను చూస్తూ ఆనందిస్తున్నారు. చూడాలి మరి అమ్మడి సందేశం ఎంతమందికి చేరుతుందో..
Tags:    

Similar News