ది హార్ట్ బీట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ విన్నారా?

Update: 2022-04-30 12:29 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన సంచ‌ల‌న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ట్రిపుల్ ఆర్‌`. మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది.

దిగ్రేట్ లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీని మ‌రింత ప్ర‌భావ వంతంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌పై ఆవిష్క‌రించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంది. 1920 నేప‌థ్యంలో జ‌రిగిన స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో ఇద్ద‌రు యోధుల క‌థ‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి  తెర‌కెక్కించారు.

మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా ద‌క్షిణాది సినిమాల విజ‌య ప‌రంప‌ర‌ని కొన‌సాగించింది. హిందీ వెర్ష‌న్ బాలీవుడ్ లో వ‌సూళ్ల ప‌రంగా  రికార్డులు సృష్టించింది. దాదాపు అక్క‌డ రెండు వంద‌ల కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఇప్ప‌టికే ప‌లు రికార్డుల్ని స‌మం చేసిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు న‌మోదు చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు బాష‌ల్లో క‌లిపి ట్రిపుల్ ఆర్ 1100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మూవీ విడుద‌లై నెల‌రోజులు దాటినా ఇప్ప‌టికీ అదే జోరుని చూపిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. `కేజీఎఫ్ 2` రిలీజ్ త‌రువాత `ట్రిపుల్ ఆర్` జోరు బాక్సాఫీస్ వ‌ద్ద కొంత ద‌గ్గిన‌ప్ప‌టికి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి కీర‌వాణి అందించిన పాటు, నేప‌థ్య సంగీతం ఆయువు ప‌ట్టుగా నిలిచిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌, అరెస్ట్ స‌న్నివేశాలు,

ఎన్టీఆర్ ప‌రిచ‌య సీన్‌.. పులిఫైట్‌.. ఆ త‌రువాత ట్రైన్ బ్రిడ్జిపై కూలిపోతున్న సంద‌ర్భంగా హీరోలిద్ద‌రిపై చిత్రీక‌రించిన సీన్ నేప‌థ్యంలో వ‌చ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌.. ప్రీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్ ఎనిమ‌ల్స్ వ్యాన్ తో బ్రిటీష్ కోట‌పై ఎదురుదాడికి దిగిన స‌న్నివేశాలు.. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ... మ‌ధ్య ఫైట్‌..  ప్రీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ని త‌ప్పించే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు.. క్లైమాక్స్ లో చ‌ర‌ణ్ ని సీతారామ‌రాజు గెట‌ప్ లో చూపించిన స‌న్నివేశాల్లో వ‌చ్చే నేప‌థ్యం.. ఇలా కీర‌వాణి అందించిన‌ ప్ర‌తీ బీజీఎమ్ ట్రిపుల్ ఆర్ ని హై స్టండ‌ర్డ్స్ లో నిల‌బెట్టి సినిమాకు ప్ర‌ధాన హార్ట్ బీట్ గా నిలిచింది.

దీంతో మేక‌ర్స్ `ది హార్ట్ బీట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మూవీ` అనే పేరుతో #SoundOfRRR OST Volume-1 ఆడియోని శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌తీ స‌న్నివేశానికి సంబంధించిన బీజిఎమ్ ని పొందుప‌ర‌చ‌డం విశేషం. హార్ట్ బీట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మూవీ అంటూ విడుద‌ల చేసిన బీజీఎమ్ ఆడియో ప్ర‌స్తుతం నెట్టింట ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే `ఎత్త‌ర జెండా`.. అంటూ సాగే సాంగ్ వీడియోని విడుద‌ల చేసిన చిత్ర బృందం తాజాగా `ది హార్ట్ బీట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మూవీ`  పేరుతో #SoundOfRRR OST Volume-1 విడుద‌ల చేయ‌డం విశేషం.



Full View
Tags:    

Similar News