రాజమౌళి నెగెటివ్ సెంటిమెంట్ బద్దలేనట

Update: 2017-10-31 07:58 GMT
రాజమౌళి దర్శకుడిగా ఎంత గొప్ప పేరు సంపాదించినా.. ఆయన శిష్యులు మాత్రం ఎవ్వరూ విజయవంతం కాలేదు. ‘ద్రోణ’తో పరిచయమైన కరుణ్ కుమార్.. ‘మిత్రుడు’ తీసిన మహదేవ్.. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాను రూపొందించిన జగదీష్ తలసిల.. ఇలా రాజమౌళి శిష్యరికం చేసి వచ్చిన వాళ్లందరూ దర్శకులుగా విఫలమయ్యారు. ఇప్పుడు రాజమౌళి మాగ్నప్ ఓపస్ ‘బాహుబలి’కి పని చేసిన వచ్చిన పళని.. ‘ఏంజెల్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తన పేరు ముందు ‘బాహుబలి’ పదాన్ని కూడా పెట్టుకుని అతను పోస్టర్ మీద పేరు వేసుకోవడం విశేషం.

ఐతే రాజమౌళి శిష్యుల విషయంలో ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంటు తమకు తెలుసని.. ఆ సెంటిమెంటును పళని బద్దలు కొడతాడని అంటున్నాడు ‘ఏంజెల్’ హీరో నాగ అన్వేష్. ఈ సినిమా విషయంలో తాము చాలా కాన్ఫిడెంటుగా ఉన్నామని.. చాలామందికి సినిమా చూపించామని.. చూసిన వాళ్లందరూ రాజమౌళి శిష్యుల్లో తొలి హిట్ కొట్టబోయేది పళనినే అన్నారని అన్వేష్ చెప్పాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌ కు అట్లీ (రాజా రాణి.. తెరి.. మెర్శల్ చిత్రాల దర్శకుడు) బాగా నచ్చిన అసిస్టెంట్ అని.. అతడి మీద శంకర్ చాలా ఆధారపడేవాడని.. అలాగే పళని అంటే కూడా రాజమౌళికి చాలా ఇష్టమని.. ‘బాహుబలి: ది బిగినింగ్’ షూటింగ్ సందర్భంగా ఎప్పుడూ పళని పళని అంటుండేవాడని తమకు చెప్పారని అన్వేష్ తెలిపాడు.
Tags:    

Similar News