దసరా సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ గా ఓపెన్ చేసాడు. పండగకు వారం రోజుల ముందే సోలోగా వచ్చి దున్నేస్తున్నాడు. ఇక ఈ గురువారం రాబోతున్న పండగ సినిమాల మీద మూవీ లవర్స్ దృష్టి వెళ్తోంది. ఆ రోజు రేస్ లో రామ్ హలో గురు ప్రేమ కోసమేతో పాటు విశాల్ పందెం కోడి 2 ఉన్నాయి. కానీ దిల్ రాజు ఎన్నడూ లేనిది హలో గురు ప్రేమ కోసమే విషయంలో నిర్లిప్తంగా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి రామ్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. గత ఏడాది చేసిన ఉన్నది ఒకటే జిందగీ ఫలితం మార్కెట్ మీద బాగానే ప్రభావం చూపించింది. దానికి తోడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గత మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. తనకూ ఇది చాలా కీలకం.
దిల్ రాజు లవర్-శ్రీనివాస కళ్యాణం బయటికి చెప్పుకోలేనంత చేదు ఫలితాలు ఇచ్చి ఆయన్ని బాగా డిఫెన్స్ లో పడేశాయి. దానికి తోడు ఇలాంటి ప్రేమ కథలకు ప్రాణంగా ఉండాల్సిన సంగీతం విషయంలో దేవిశ్రీప్రసాద్ లాంటి అగ్ర శ్రేణి సంగీత దర్శకుడు యావరేజ్ అవుట్ ఫుట్ ఇవ్వడం పట్ల ఇప్పటికే కొంత నెగటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇంత స్థబ్దుగా ఉండటం పట్ల అనుమానం కలగడం సహజం. పైగా అరవింద సమేత వీర రాఘవ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. వారం గ్యాప్ చాలా తక్కువ కాబట్టి రామ్ మూవీ దాన్ని ప్రభావితం చేసేంత సీన్ ఉండకపోవచ్చు. పైగా విశాల్ పందెం కోడి 2తో మరో ఫ్యాక్షన్ మసాలా సినిమాతో వస్తున్నాడు. బాగుంటే మాస్ దానివైపు మళ్లే అవకాశం ఉంది.
హలో గురు ప్రేమ కోసమే దర్శకుడు నక్కిన త్రినాధరావు ఒకే ఫార్ములాతో మామా అల్లుళ్ళ మధ్య పాయింట్ తోనే తీస్తుంటాడు అనే టాక్ కు బలాన్ని చేకూరుస్తూ ఇది కూడా అదే బాపతులో ఉందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన వాళ్లకు కలిగింది. ఈ నేపధ్యంలో హలో గురు ప్రేమ కోసమే నడక అంత ఈజీగా ఉండబోవడం లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య చాలా బాగుంది అనే టాక్ వస్తే తప్ప ఫైట్ చేయడం కష్టం. ప్రీ రిలీజ్ వేడుక చేసారు ఈ కాంబినేషన్ కు రావాల్సిన హైప్ కనిపించడం లేదన్నది మాత్రం నిజం.