తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని, సినీ ప్రముఖులు సహాయం చేసి ప్రాణాలు నిలబెట్టాలని ప్రముఖ సినీ నటుడు పొన్నాంబళం వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే.. ఇప్పుడు కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. తన సోదరి కుమారుడు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే.. ఆపరేషన్ కు అవసరమైన డబ్బు మాత్రం తన వద్ద లేదని తెలిపారు..
గత ఐదేళ్లుగా తన అనారోగ్యానికి ఎంతో ఖర్చయ్యిందని, తాను సినిమాలకు దూరమవడంతో ఆదాయం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు పొన్నాంబళం. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సహాయం చేశారని తెలిపారు. రజనీకాంత్, కమల్ హాసన్, రాధికా శరత్ కుమార్ తోపాటు ధనుష్, కేఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ తదితరులు ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు.
ఇప్పుడు ఆపరేషన్ కు చాలా డబ్బు ఖర్చు అవుతోందని, సౌత్ యాక్టర్స్ అసోసియేషన్ తోపాటు, తెలుగు చిత్ర పరిశ్రమ 'మా' నుంచి సాయం చేయాలని వేడుకున్నారు. కాగా.. పొన్నాంబళం తెలుగుతో సహా.. దక్షిణాదిలోని అన్ని చిత్రపరిశ్రమల్లోనూ నటించారు. ప్రధానంగా విలనీ పాత్రలను పోషించిన ఆయన.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.