గత ఏడాది శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏకంగా పది నెలల గ్యాప్ తీసుకున్న నితిన్ రేపటి నుంచి మేకప్ వేసుకుని సెట్ లో అడుగు పెట్టబోతున్నట్టు తెలిసింది. ఛలో ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపొందనున్న భీష్మ షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఛలో తర్వాత వెంకీ కూడా ఇదే స్క్రిప్ట్ మీద ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాడు. ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన భీష్మ ఇకపై నాన్ స్టాప్ గా షూట్ చేసుకోబోతున్నాడు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాలూకు కార్టూన్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడిక రియల్ పాత్రలు రంగంలోకి దిగుతున్నాయి. సితార బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో నితిన్ సినిమా ఏదీ రాలేదు కాబట్టి భీష్మని నవంబర్ లోగా తీసుకొచ్చే విధంగా షెడ్యూల్స్ డిజైన్ చేసినట్టుగా తెలిసింది.
ఎలాగూ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ కాబట్టి మార్పులు చేర్పులు ఉండేవు. దానితోడు నితిన్ ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నాడు. సో ఫుల్ జోష్ మీదుంటాడు. పెళ్లంటే అసలు గిట్టని ఓ యువకుడి కథగా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో వెంకీ కుడుములు దీన్ని రాసుకున్నట్టు వినికిడి. అఆ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కు భీష్మనే బ్రేక్ ఇవ్వాలి