ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హీరోలలో శ్రీకాంత్ ఒకరు. కెరియర్ ఆరంభంలో విలన్ కొడుకుగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వెళ్లాడు. కుర్రాడు కుదురుగా ఉన్నాడని భావించిన దర్శక నిర్మాతలు అతనిని హీరోను చేసేశారు. చక్కని హెయిర్ స్టైల్ తో .. ఆకర్షణీయమైన వాకింగ్ స్టైల్ తో శ్రీకాంత్ ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. చాలా వేగంగా ఆయన 100 సినిమాలను పూర్తి చేశాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఫ్యామిలీ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన శ్రీకాంత్ కి చాలాకాలం క్రితమే ఊహతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. రోషన్ .. రోహన్ .. మేధ. ఈ ముగ్గురిలో రోషన్ తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. అందువలన అతను ఎలా ఉంటాడనేది చాలామందికి తెలుసు.
ఇక మేధను చాలా చిన్నప్పుడు కొంతమంది చూశారు. రోహన్ మాత్రం చాలామందికి తెలియదు. ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఈ మధ్య కాలంలో జనాలకు ఒక్కసారిగా కనిపించింది లేదు. అలాంటి వీరంతా ఈ రోజున తిరుమల కొండపై కనిపించారు.
శ్రీకాంత్ .. ఊహ ఉద్దరూ కూడా తమ ముగ్గురు పిల్లలతో ఈ రోజున స్వామి దర్శనానికి కొండపైకి వచ్చారు. హీరో హీరోయిన్లుగానే కాకుండా, అందమైన జంటగా కూడా శ్రీకాంత్ - ఊహలకు మంచి క్రేజ్ ఉంది. అందువలన వాళ్లను చూడటానికి చాలామంది ఎగబడ్డారు. 'మన శ్రీకాంత్ పిల్లలు అప్పుడే పెద్దోళ్లయిపోయారే' అని చెప్పుకున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు మేధ అప్పుడే ఇంత ఎదిగిపోయిందా అని ఆశ్చర్యపోయారు. లంగాఓణీలో మెరిసిపిపోతున్న మేధను చూసి మురిసిపోయారు.
మొత్తానికి చాలా కాలం తరువాత శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తాన్ని చూసే అదృష్టం అభిమానులకు కలిగింది. అందుబాటులో ఉన్న వాళ్లంతా వాళ్లతో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించారు. చాలా దూరం వాళ్ల వెనుకే నడుస్తూ, వాళ్లను గురించి మాట్లాడుకున్నారు.
ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు రోషన్ ను హీరోగా నిలబెట్టడం పైనే పూర్తి దృష్టి పెట్టాడు. అవకాశాన్ని బట్టి తాను హీరోగా చేస్తున్నాడు .. లేదంటే విలన్ పాత్రల వైపు కూడా వెళుతున్నాడు. 'అఖండ'లో ఆయన విలనిజానికి మంచి మార్కులు పడిన సంగతి తెలిసిందే.