నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలమే రేపింది. ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను తప్పించే క్రమంలో టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో సుదాకర్ కోమాకుల - నువ్వు తోపురా సినిమా డైరెక్టర్ హరినాథ్ బాబు - సినిమా హీరోయిన్ - ఇతర సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి పెద్దగా గాయాలేమీ కాకున్నా... రోడ్డుకు మధ్య ఉన్న చెట్లకు నీరు పోసే పనిలో నిమగ్నమై ఉన్న మునిసిపల్ కార్మికురాలు మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
ఈ కారు ప్రమాదం సంభవించగానే... ప్రమాద సమయంలో హీరో సుధాకరే కారును నడుపుతున్నారని - అతడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఓ మునిసిపల్ కార్మికులు చనిపోవడం - కారులోని సుధాకర్ తో పాటు హీరోయిన్ - డైరెక్టర్ హరినాథ్ బాబు - మరొకరికి గాయాలు అయ్యాయన్న వార్తలు కలకలమే రేపాయి. ప్రమాదం జరిగిన తీరుపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి తెలుసుకున్న హరినాథ్ బాబు... అసలు విషయాన్ని వెల్లడించేందుకు మీడియాతో మాట్లాడారు. ప్రమాద సమయంలో సుధాకర్ డ్రైవింగ్ చేయలేదని - కారు డ్రైవరే డ్రైవింగ్ చేశాడని - డ్రైవర్ పక్క సీట్లో సుధాకర్ కూర్చున్నాడని ఆయన తెలిపారు.
ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ను తప్పించే క్రమంలో కారును పక్కకు తిప్పగా... అప్పటిదాకా మొక్కలకు నీళ్లు పోస్తున్న మునిసిపల్ కార్మికురాలు సడెన్ గా రోడ్డుపైకి రావడం - ఆమెను తప్పించబోయి కారును మరింతగా టర్న్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఎంతగా యత్నించినా... ఈ ప్రమాదంలో మునిసిపల్ కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయని - ఆ గాయాల నుంచి కోలుకోలేక ఆమె చనిపోయిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే... ఈ ప్రమాదంలో తనతో పాటుగా సుధాకర్ - సినిమా హీరోయిన్ - మరొకరికి గాయాలయ్యాయని హరినాథ్ బాబు తెలిపారు. సుధాకర్ హీరోగా తెరకెక్కిన నువ్వు తోపురా సినిమా ప్రమోషన్ కోసమే తాము ఏపీకి వచ్చినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు.