తమిళంతోపాటు తెలుగు భాషలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలెంటెడ్ హీరో.. వచ్చే నెలలో 45వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కరొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతుంటే.. విశాల్ మాత్రం లవ్ - ఎంగేజ్మెంట్ దగ్గర్లోనే ఆగిపోయాడు. అయితే ఇప్పుడు లేటెస్టుగా విశాల్ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె, హీరోయిన్ వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వరలక్ష్మీ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. ఈ క్రమంలో 2019లో తెలుగమ్మాయి అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం చేసుకున్నారు.
'అర్జున్ రెడ్డి' సినిమాలో నటించిన అనీశాతో ఆరు నెలలు సహవాసం చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు విశాల్. టర్కీలో తన సినిమా షూటింగ్ కు ఆమెను కూడా వెంట తీసుకెళ్లాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతారని అనుకుంటుండగా.. ఏమైందో ఏమో కానీ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు.. సోషల్ మీడియాలో పోస్ట్స్ అన్నీ డిలీట్ చేసుకున్నారు.
అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న విశాల్.. కెరీర్ పైనే దృష్టి పెట్టాడు. నడిగర్ సంఘం కోసం కొత్త భవనం నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం చేసాడు విశాల్. ఓవైపు బిల్డింగ్ పనులు జరుగుతుండగా.. మరోవైపు పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల విశాల్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లిపై తన అభిప్రాయం చెబుతూ.. ''త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ఇంట్లో చూసినవారిని చేసుకోవాలనుకోవడంలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను'' అని వెల్లడించినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఎవరన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టినట్లు చెబుతున్నారు. మరి ఈసారైనా విశాల్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. విశాల్ ప్రస్తుతం 'లాఠీ' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో 'డిటెక్టివ్ 2' సినిమా చేస్తున్నాడు. త్వరలో 'అభిమన్యుడు 2' 'మార్క్ ఆంటోనీ' వంటి చిత్రాల్లో నటించనున్నారు.