ఆశ దోశ అప్పడం వడ అంటున్న రాకీ భాయ్!

Update: 2019-06-08 07:04 GMT
కన్నడ ఇండస్ట్రీ గురించి సౌత్ లోని ఇతర భాషల వారికే పెద్దగా తెలియదు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన 'కె జీ ఎఫ్: చాప్టర్ 1' భారీ స్థాయిలో పలు భారతీయ భాషలలో విడుదల కావడమే కాదు.. ఘన విజయం సాధించింది. దీంతో అందరి చూపు ఒక్కసారిగా శాండల్ వుడ్ పై పడింది. అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు నిర్మాతలలో .. ఇటు యష్ కు ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది.  'కె జీ ఎఫ్: చాప్టర్ 2' కోసం ఇప్పుడు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఫస్ట్ పార్ట్ లో రాకీ భాయ్ గా యష్ నటన.. రగ్డ్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యష్ హెయిర్ స్టైల్.. ఆ గుబురు గడ్డానికి చాలామంది ఫిదా అయ్యారు. మరి సెకండ్ పార్ట్ లో యష్ లుక్ ఎలా ఉండబోతోంది? సేమ్ లుక్కేనా లేదా లుక్ మారుస్తాడా.. అనేదానిపై చర్చలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యష్ ఫోటో ఒక ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆ ఫోటోలో యష్ జుట్టు.. గడ్డం మరింత పొడవుగా ఉన్నాయి. సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఈ ఫోటోను చూసిన చాలామంది సెకండ్ పార్ట్ లో యష్ లుక్ ఇదేనని ఫిక్స్ అయ్యారు.  కానీ యష్ మాత్రం పార్ట్ 2 లో తన ఇది కాదని అంటున్నాడు.

'కె జీ ఎఫ్ 2' లో తన లుక్ ను ఇప్పుడే బైట పెట్టే ఆలోచన లేదని చెప్పాడు. ప్రేక్షకుల కు తన లుక్ పై ఉండే ఆసక్తిని కొన్ని రోజులు కంటిన్యూ చేస్తానని.. అయితే వారి ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవుతామని తెలిపాడు. మాటలు చక్కగా చెప్తున్నాడు కానీ లుక్ సంగతి చెప్పలేదు. యష్ సంగతి  ఇలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డబల్ ఇంపాక్ట్ ఉండేలా సెకండ్ పార్ట్ ను తీర్చిదిద్దుతున్నామని తెలిపాడు.  


Tags:    

Similar News