స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టే హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్.. డిజిటల్ బిజినెస్ లో జోరు కొన సాగుతోంది. ఈ విషయం లో మహేష్- అల్లు అర్జున్- ప్రభాస్-చరణ్- ఎన్టీఆర్ తదితర టాప్ స్టార్ల దూకుడు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` హిందీ డబ్బింగ్ శాటిలైట్ సహా డిజిటల్ బిజినెస్ కి సంబంధించిన అప్ డేట్ తాజా గా రివీలైంది. ఈ సినిమాకి 15.5 కోట్ల మేర హిందీ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యింది.
తాజా గా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ `అల వైకుంఠపురములో` హిందీ బిజినెస్ కి సంబంధించిన సమాచారం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కి ఏకంగా 19.5 కోట్ల మేర డీల్ కుదిరిందని తెలుస్తోంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు డీల్ తో పోలిస్తే బన్ని స్పీడ్ మీద ఉన్నాడని ఈ ఫిగర్ చెబుతోంది.
బన్ని నటించిన `నా పేరు సూర్య` తెలుగు శాటిలైట్ తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్.. శాటిలైట్ డిజిటల్ కలుపుకుని సుమారు 24 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఆ డీల్ తో పోలిస్తే అల వైకుంఠపురము లో డీల్ పెద్దదే. కేవలం హిందీ డీల్ కే 19.5కోట్లు రాబట్టింది ఈ చిత్రం. బన్ని గత చిత్రం `నా పేరు సూర్య` ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తాజా డీల్ పై ఆ ప్రభావం కనిపించ లేదని అర్థమవుతోంది. ఇక మహేష్ నటించిన మహర్షి చిత్రంతో పోలిస్తే `సరిలేరు నీకెవ్వరు` డీల్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహర్షితో పోలిస్తే.. ఏకంగా ఐదు కోట్లు తగ్గినా డీల్ పూర్తి చేసేశారు. మహేష్ రేంజు ఈ సారి తగ్గడం పై ట్రేడ్ లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` హిందీ రైట్స్ ని 9 కోట్ల రేంజులో విక్రయించిన సంగతి తెలిసిందే.