కరోనా వైరస్ దేశంలో ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది. వయసు మీద పడ్డ వాళ్లకు మాత్రమే ఇది ప్రమాదం అనుకోవడానికి వీల్లేదు. తెలియని ఆరోగ్య సమస్యలున్న చిన్న వయస్కులు సైతం ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్లో సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ సైతం కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక కరోనా మరణాల్లో అత్యంత విషాదకరమైందంటే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యందే. కరోనాతో ఆసుపత్రిలో చేరి తాను బాగానే ఉన్నానంటూ హుషారుగా చెప్పిన ఆయన నెలన్నర రోజుల పాటు కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఒక దశలో బాగానే కోలుకున్నట్లు అనిపించిన ఆయన.. ఉన్నట్లుండి విషమ స్థితికి చేరుకుని తుది శ్వాస విడవడం అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఈ నేపథ్యంలో సెలబ్రెటీలెవరైనా కరోనాతో ఇబ్బంది పడుతున్నారంటే అభిమానుల్లో ఆందోళన నెలకొంటోంది. ఐదు రోజుల కిందట సీనియర్ హీరో రాజశేఖర్ తనతో పాటు భార్య, ఇద్దరు కూతుళ్లు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. శివాని, శివాత్మిక ఇద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. తాను, జీవిత ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు రాజశేఖర్ తెలిపారు. కాగా రాజశేఖర్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తాజాగా ఆయన చిన్న కూతురు శివాత్మిక ట్విట్టర్లో వెల్లడించడంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. రాజశేఖర్ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్న సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేయడం గమనార్హం. రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన ఆ ఆసుపత్రి.. ఆయనకు వెంటిలేటర్ కూడా పెట్టినట్లు తెలిపింది. ఐతే బాలుకు పెట్టినట్లు గొంతు లోపలికి పైప్ పంపి పెట్టిన వెంటిలేటర్ కాదిది. ఊపిరితిత్తులు పని చేయనపుడు కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ అది. రాజశేఖర్ అలా కాకుండా ముఖానికి మాస్క్ పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారన్నమాట. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ ఉండి శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నపుడు ఈ వెంటిలేటర్ పెడతారు. దీన్ని నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ అంటారు. రాజశేఖర్ పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లుగా బులిటెన్ లో పేర్కొనడం ఊరటనిచ్చే విషయం.