బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్స్ బుల్లి తెరపై సందడి చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్.. కేబీసీ కోసం అమితాబ్.. టాక్ షో ల కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్స్ హోస్ట్ లుగా మారారు. ఇప్పుడు ఆ జాబితాలో ఫైర్ బ్రాండ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ నిలువబోతుంది. సహజంగానే ఆమె మాట్లాడితే ఫైర్ అన్నట్లుగా ఉంటుంది. ఆమె ప్రతి విషయంలో కూడా మొహమాటం లేకుండా తన అభిప్రాయంను చెబుతూ చాలా మంది మనసులు నొప్పిస్తూ ఉంటుంది. ఇక రియాల్టీ షో కు ఆమె హోస్ట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే షో పై జనాల్లో ఆసక్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
కంగనా రనౌత్ తో ప్రముఖ ఫిల్మ్ మేకర్ కమ్ టీవీ షో మేకర్ ఏక్తా కపూర్ ఈ రియాల్టీ షో ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. హాట్ ముద్దుగుమ్మలు పూనం పాండే వంటి వారు ఈ షో కు ప్రథాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. షో ఫార్మట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాని అమెరికన్ ప్రముఖ టీవీ షో అయిన టెంప్టేషన్ ద్వీపం తరహా లో ఈ షో ఉంటుందని హిందీ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఆ షో మరీ బోల్డ్ గా ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి దూరంగా.. కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే ఆ థీమ్ తీసుకుని ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి మరియు ఆసక్తికి తగ్గట్లుగా షో ను డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ తో కంగనా చాలా ఫైర్ అయ్యే విధంగా ఈ షో ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో పాటు తన మణికర్ణిక బ్యానర్ లో కూడా బయట సినిమాలను నిర్మిస్తున్న కంగనా రనౌత్ ఇతర స్టార్స్ కు తాను ఏమీ తక్కువ కాదు అని నిరూపించుకునేందుకు గాను ఈ టీవీ రియాల్టీ షో ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హీరోలుగా మరియు హీరోయిన్స్ గా కంటే కొందరికి ఇలా రియాల్టీ షో ల ద్వారా హోస్టింగ్ చేయడంతో భారీ గుర్తింపు దక్కింది. అందుకే కంగనా రనౌత్ ఈ షో ను చేసేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఏక్తా కపూర్ రియాల్టీ షో లు మరియు టీవీ షో లు అన్ని కూడా చాలా బోల్డ్ గా మరో రేంజ్ అన్నట్లుగా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కంగనా చేయబోతున్న ఈ షో కూడా మరో లెవల్ ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వడం మాత్రమే కాకుండా మరో లెవల్ బోల్డ్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ షో ను అత్యంత ఆసక్తికరంగా నిర్వహించేందుకు క్రియేటివ్ టీమ్ ప్రస్తుతం ప్లాన్ చేస్తుందట. షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నెలలోనే షో షూటింగ్ ప్రారంభించి మూడు నెలల పాటు షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా నాలుగు నుండి అయిదు నెలల పాటు ఈ షో ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఏక్తా కపూర్ కు చెందిన ఓటీటీ లో కూడా ఈ షో ను స్ట్రీమింగ్ చేయబోతున్నారట.