మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహారెడ్డి కి భారీగానే వసూళ్లు నమోదు అయ్యాయి. కాని శృతి మించిన బడ్జెట్ కారణంగా లాస్ వెంచర్ అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. సైరాకు వచ్చిన లాస్ ఎంతో కాని ఇప్పుడు ఆ సినిమాకు పెట్టిన వృదా ఖర్చు గురించి లెక్కలు వేసుకుంటున్నారు. రామ్ చరణ్ తన తండ్రి కెరీర్ లో నిలిచి పోయేలా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కడ రాజీ పడకుండా డబ్బులు ఖర్చు చేయడం జరిగిందట.
దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా భారీగా రిచ్ గా రావాలనే ఉద్దేశ్యంతో ఇష్టానుసారంగా ఖర్చు చేశాడట. మొత్తంగా ఈ సినిమాకు 270 నుండి 300 కోట్ల మద్య ఖర్చు అయినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులే ప్రమోషన్ కార్యక్రమాల సందర్బంగా చెప్పుకొచ్చారు. సినిమాలో ఆ భారీతనం కనిపిస్తుంది. కాని సినిమా ఉత్తరాది వారిని మరియు ఇతర భాషల వారిని అలరించడంలో విఫలం అయ్యింది. అందుకే వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది.
ఇక సినిమాలో వృదా ఖర్చులు దాదాపుగా 50 కోట్ల వరకు ఉంటాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సైరా కోసం 8.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక భారీ పాటను చిత్రీకరించారట. ఆ పాట చిత్రీకరణ కోసం వందలాది మంది డాన్సర్స్ మరియు జూనియర్ ఆర్టిస్టులను వినియోగించారట. కాని ఆ పాట ప్లేస్ మెంట్ సరిగా కుదరక పోవడంతో.. ఆ పాటను ఎక్కడ పెట్టినా కూడా స్టోరీని బ్రేక్ చేస్తుందేమో అనే ఉద్దేశ్యంతో సినిమాలో పెట్టలేదట. ఆ పాటను త్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇంకా కొన్ని సెట్టింగ్స్ ను కోట్లు పెట్టి నిర్మించి వాటిని ఉపయోగించలేదని.. అనవసరమైన ఖర్చులు ఇంకా చాలా చేశారని.. కొందరికి పారితోషికాలు ఇచ్చి కూడా వారితో నటింపజేయలేదు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇలా మొత్తంగా 50 కోట్ల వరకు సినిమాకు అదనంగా పెట్టి ఉంటారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే చిరంజీవి కెరీర్ లో నిలిచి పోయే సినిమా చేయాలని భావించి అలాంటి సినిమాను ఇచ్చిన చరణ్ కు ఆ వృదా పెద్ద లెక్కలోకి రాదని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే నిలిచి పోయే సినిమాను నిర్మించిన నిర్మాతగా చరణ్ ఎప్పటికి నిలిచి పోతాడంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
ఇలాంటి భారీ సినిమాలు తీసినప్పుడు కొన్ని వృదాలు తప్పవని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమా నుండి పెద్ద బడ్జెట్ సినిమా వరకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి. సైరా పెద్ద బడ్జెట్ కనుక కాస్త ఎక్కువ వృదా అయ్యింది అంటూ మెగా కాంపౌండ్ చాలా లైట్ గా ఉన్నారట.