రూ.299 ప‌ర్ వ్యూ.. కొత్త హీరో సెల్ఫ్ గోల్?

Update: 2020-09-23 02:30 GMT
యువ‌హీరో ఇషాన్ ఖట్టర్- అనన్య పాండే జంట‌గా న‌టించిన హిందీ చిత్రం `ఖాలి పీలీ`. మ‌క్భూల్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ జాఫ‌ర్- హిమాన్షు కిష‌న్ మెహ్రా- జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ మూవీ పే ప‌ర్ వ్యూ అనే ఒప్పందం తో ఓటీటీలో విడుద‌లైన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ లో చిన్న చిత్రాల‌కు ఓటీటీల్లో వ్యూస్ పూర్ గా వ‌స్తున్న నేప‌థ్యంలో ఓటీటీ కంప‌నీ వ్యూ ప‌ర్ పే ఒప్పందం నేపథ్యంలో రిలీజ్ చేశారు.

దీంతో ఈ చిత్రానికి మేక‌ర్స్ దురాశ‌తో రూ.299 ప‌ర్ వ్యూగా నిర్ణ‌యించారు. ఇదే ఈ సినిమా కొంప ముంచింది. ఇదే టిక్కెట్ రేట్ కి త‌క్కువ మొత్తాన్ని చెల్లించి మ‌ల్టీప్లెక్స్ లో సినిమా చూసేయెచ్చు. దీంతో మేక‌ర్స్ పై బాలీవుడ్ ‌లో సెటైర్లు ప‌డుతున్నాయి. మేక‌ర్స్ అత్యాశ‌కు పోయి పేప‌ర్ వ్యూ కోసం 299 రేట్ ‌ని నిర్ణ‌యించి సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని అంతా కామెంట్ లు చేస్తున్నారు. ఈ రోజుల్లో స్టార్ హీరో సినిమాకే ఈ రేటు నిర్ణ‌యిస్తే ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిప‌ని పరిస్థితి.

పేరున్న విజ‌య్ సేతుప‌తి నటించిన త‌మిళ చిత్రం `క‌పే సింఘం`కు మేక‌ర్స్ పే ప‌ర్ వ్యూ కింద 199 గా నిర్ణ‌యించారు. అయితే దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని జీప్లెక్స్ `ఖాలీ పీలీ` చిత్రానికి పే ప‌ర్ వ్యూ ధ‌ర‌ని భారీగా పెంచ‌డంతో పైర‌సీకి ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డే అవ‌కాశం వుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ఈ మూవీని అక్టోబ‌ర్ 2న జీప్లెక్స్ లో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. ఇదే రోజు అనుష్క న‌టించిన `నిశ్శ‌బ్దం` అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ `ఖాలీ పీలీ` చిత్రానికి గ‌ట్టి పోటీని ఇవ్వ‌డం కాయ‌మ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News