వంశీ పైడిపల్లికి ఊపిరి ఆడడం లేదట!

Update: 2019-03-01 09:07 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలేవైనా పట్టాలెక్కిన తర్వాత రిలీజ్ అయ్యేసరికి  ఏడాది సమయం పడుతుంది.  ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈ సినిమాను ఏప్రిల్ 25 న విడుదల చేసేందుకు ప్లాన్ చేయడం.. మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని దర్శకనిర్మాతలు అనుకోవడం.. కానీ మహేష్ ఏప్రిల్ లోనే అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని పట్టుబట్టడంతో అదే డేట్ ను కన్ఫాం చేయడం తెలిసిన విషయాలే.

నిజానికి వాయిదా వేయాలనుకున్నది షూటింగ్ లో డిలే వల్లనే.  కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలంటే హడావుడి పడక తప్పదు కదా. ప్రస్తుతం 'మహర్షి' టీమ్ పరిస్థితి అలాగే ఉందని టాక్.  ముఖ్యంగా వంశీ పైడిపల్లికి ఊపిరి ఆడడం లేదట.  వంశీ పైడిపల్లి సినిమా తెరకెక్కించే విధానం సుకుమార్ స్టైల్లో ఉంటుందని ఎప్పటి నుంచో టాక్. పూరి జగన్నాధ్ మాదిరిగా ఫటాఫట్ ధనధన్ అంటూ షూటింగ్ పూర్తి చేసిరిలీజ్ చేసే బాపతు కాదు.  దాంతో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్ల లాగా కిందామీదా అయిపోతున్నాడట.  

ఏదైతేనేం.. సినిమా అనుకున్న సమాయనికి రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.  సమ్మర్లో ఇతర స్టార్ హీరోల సినిమాలు లేవు కాబట్టి హిట్ టాక్ వస్తే మహేష్ సినిమా ఆకశామే హద్దుగా చెలరేగి పోతుందనడంలో సందేహం లేదు.  ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన మహేష్ సినిమాలు గతంలో సూపర్ హిట్స్ సాధించిన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి సెంటిమెంట్ పరంగా కూడా పాజిటివ్ గా ఉంది.  మరి ఎలాగోలా వంశీ పెండింగ్ షూట్ త్వరగా పూర్తి చేయక తప్పదు.
Tags:    

Similar News