హీరో రామ్ కు ఇలాంటి రొటీన్ లుక్స్ అన్నీ అలవాటే. నాకెవ్వరూ లేరూ అనాథను.. నా దగ్గర పైసా కూడా లేదు.. అంటుంటాడు.. కట్ చేస్తే అదే సినిమాలో సూపర్ డ్రై వంటి ఇంపోర్టెడ్ బ్రాండ్ బట్టల్లో కనిపిస్తుంటాడు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే ''హైపర్'' అంటూ ముందుకొచ్చాడు ఈ కుర్ర హీరో. పదండి ఎలా ఉందో చూద్దాం.
ఆ మధ్యన రభస సినిమా తీసి ఘోరంగా దెబ్బతిన్న సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఇప్పుడు ''హైపర్'' అంటూ వచ్చేస్తున్నాడు రామ్. ప్రతీ ఇంట్లో ఇలాంటి కుర్రాడు ఒకడుంటాడు అంటూ కోపం పీక్స్ లో ఉండే ఒక కుర్రాడి కథను చెబుతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. ఇక ఫస్టు లుక్ పోస్టర్లో సినిమా కాన్సెప్టు కనిపించేలా పెద్ద హంగామా ఏమీ లేదు. కాన్సెప్టు పోస్టర్లు జనాలకు విపరీతంగా నచ్చుతున్న ఈ రోజుల్లో కేవలం ఒక రొటీన్ లుక్ తో.. గాలిలో కళ్లద్దాలు ఎగరేసుకుంటూ నడిచొస్తున్న రామ్ ఈ పోస్టర్ మీద కనిపిస్తున్నాడు. చూస్తుంటే పరమ రొటీన్ పోస్టర్ అనే చెప్పాలి.
సర్లేండి.. ఈ మధ్యన కాస్త పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఇలా రొటీన్ గానే ఉంటున్నాయి మరి. కనీసం కంటెంట్ తో ఆకట్టుకుంటే ఆ కిక్కు డిఫరెంట్ గా ఉంటుంది.