రాజా వ‌ర్సెస్ రెహ‌మాన్.. అస‌లేమైంది?

Update: 2021-01-16 04:08 GMT
సుస్వ‌రాల పూదోట‌లో మాంత్రికులుగా వెలిగిపోయిన గొప్ప సంగీ‌త ద‌ర్శ‌కులు ఇళ‌య‌రాజా.. ఏ.ఆర్.రెహమాన్. ఆ ఇద్ద‌రి మధ్య పోటీనా? ఇది ఎప్ప‌టికీ ఉండ‌దు. ఎవ‌రికి వారు త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. అయితే స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న పొన్నీయిన్ సెల్వన్ చిత్రానికి ఏ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా.. అదే క‌థ‌తో అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న వెబ్ సిరీస్ కి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఓవైపు మ‌ణిర‌త్నం `పొన్నియ‌న్ సెల్వ‌న్` చిత్రీక‌ర‌ణలో బిజీగా ఉండ‌గానే... మ‌రోవైపు చిరంజీవి అనే ఫిలింమేక‌ర్ `పొన్నియ‌న్ సెల్వ‌న్`   వెబ్-సిరీస్ ని లాంచ్ చేస్తున్నారు. అజయ్ ప్రతీబ్ ఈ సిరీస్ ‌కి దర్శకుడు. ఆసక్తికరంగా ఈ రెండిటికి సంగీతం అందిస్తున్న‌ది ఇద్ద‌రు లెజెండ్స్ కాబ‌ట్టి ఎవ‌రు ది బెస్ట్ ? అన్న‌ది అభిమానుల మ‌ధ్య పోటా పోటీ చ‌ర్చ‌గా మారింది. రెహమాన్ .. ఇళ‌యరాజా ఇద్దరూ చారిత్రాత్మక క‌థాంశం ఉన్న సినిమాలకు అత్యుత్త‌మ సంగీతం అందించ‌గ‌ల స‌మ‌ర్థులు. ప్ర‌త్యేకించి వ‌ర‌ల్డ్ క్లాస్ బీజీఎంని అందించ‌డంలో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు.

మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ప్రస్తుతం హైదరాబాద్ లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకి భారీ తారాగ‌ణంతో పాటు టాప్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. తాజాగా ప్ర‌కాష్ రాజ్ - ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ పై స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. చిరంజీవి పొన్నియిన్ సెల్వన్ ఆగస్టు 18 న ప్రారంభ‌మ‌వుతోంది. హైదరాబాద్ - మైసూర్- కేరళ -శ్రీలంకలలో చిత్రీకరించ‌నున్నారు.
Tags:    

Similar News