ఇల్లూ, త్రిపాఠి.. వాటే ఓపెన్‌ షోస్‌

Update: 2015-08-23 10:42 GMT
    మెగా వేడుక బోలెడంత విందు పసందు పంచింది. మెగా -డే వేడుకల్లో ఫ్యాన్స్‌, యంగ్‌ బోయ్స్‌ పండగ చేసుకున్నారు. ముఖ్యంగా కథానాయికలు ఈ పండగలో ఐఫీస్ట్‌ చేశారు. ముంబై నుంచి వచ్చిన ఇలియానాతో పోటీపడుతూ యువకథానాయిక, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి వేసుకొచ్చిన డ్రెస్సు పెద్ద టాపిక్‌ అయిపోయింది. వేడుక ఆద్యంతం యువతరం కళ్లన్నీ ఇలియానా, లావణ్య చుట్టూనే తిరిగాయి. ఆ రేంజులో ఓపెన్‌ షోస్‌ చేశారంటూ వేదిక వద్ద ఒకటే గుసగుసలు.

    ఇలియానా ముంబై వెళ్లాక పూర్తిగా మారిపోయింది. అక్కడ ఓపెన్‌ షోస్‌ కి అలవాటు పడిపోయింది. ఫ్రీస్టయిల్‌ లో స్వేచ్ఛగా అందాల్ని ఆరబోసే పద్ధతి ముంబై సెలబ్రిటీలకు అలవాటు. దాదాపు పాశ్చాత్య కల్చర్‌ అక్కడ రాజ్యమేలుతుంది. అదే ధోరణిలో ఇల్లూ కనిపించింది. వెస్ట్రన్‌ ఔట్‌ ఫిట్‌ లో జెన్నిఫర్‌ లోపేజ్‌ ని తలపించింది. డ్రస్సు ముందు భాగంలో మొత్తం ఓపెన్‌ గా ఉండటం చూసి అతిథులు అవాక్కయ్యారు.

    ఇక నేనేమైనా తక్కువా? అన్నట్టు అందాల రాక్షసి లావణ్య కూడా సేమ్‌ టు సేమ్‌ ఓపెన్‌ మైండ్‌ సెట్‌ తో డ్రెస్‌ సెన్స్‌ మెయింటెయిన్‌ చేసింది. ఛోళీకే పీచే క్యాహై .. టైపులో డ్రెస్సు లో విచ్చేసింది. నాభికేంద్రం, మెడ దిగవున ఓపెన్‌ షోస్‌ తో అదరగొట్టేసింది. కుర్రాళ్ల కళ్లన్నీ గింగిరాలు తిరిగాయంటే నమ్మండి. కొంపదీసి మెగాస్టార్‌ 150వ సినిమాకి లైనేస్తున్నారా.. ఏంటి?
Tags:    

Similar News