గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయిపోయింది. మరీ కుప్పలు తెప్పలుగా ఆఫర్లు లేకపోయినా.. ఒకదాని వెంట ఒకటి చొప్పున బాగానే కౌంట్ పెంచుకుంటోంది. రీసెంట్ గా ఈమె మీద బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. సినిమా ఫీల్డ్ అన్నాక రూమర్స్ సహజమే.
కానీ ఇక్కడ అజయ్ దేవగన్ తో ఇలియానా పేరు వినిపించడమే ఆశ్చర్యకరమైన విషయం. కాజోల్ భర్త అయిన అజయ్ దేవగన్ కు.. చాలా మంచి పేరు ఉంది. ఇప్పటివరకూ ఈ హీరోకు ఏ హీరోయిన్ తోనూ లింక్ అన్న న్యూస్ వినిపించలేదు. కానీ ఇల్లీ విషయంలో మాత్రం ఈయన బాగా ఇంట్రెస్ట్ చూపించేస్తున్నాడట. వీరిద్దరూ కలిసి బాద్షాహో మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైడ్ మూవీలో అజయ్ దేవగన్ రికమెండ్ చేస్తేనే.. ఈమెకు ఆఫర్ వచ్చింది. ఆ సంగతి ఈమె కూడా ఒప్పుకుంది. టోటల్ ఢమాల్ అనే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తెగ రికమెండ్ చేస్తున్నాడంటూ అజయ్ దేవగన్ పై వార్తలు వస్తున్నాయి.
ఇవన్నీ ఈమెను తెగ హర్ట్ చేసేస్తున్నాయట. టోటల్ ఢమాల్ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అయినా రికమెండ్ చేసినంత మాత్రాన రిలేషన్ ఉన్నట్లేనా అంటూ మండిపడుతోంది ఇల్లీ బేబీ. తనకు అజయ్ దేవగన్ అంటే బోలెడంత గౌరవం ఉందని.. కొత్త కొత్త మాటలు వినాల్సి రావడం చాలా బాధ పెడుతోందని అంటోంది ఇలియనా.