ఇల్లీ.. ఈ మాట సిల్లీగా చెప్పలేదు..

Update: 2016-02-29 06:02 GMT
ఒంటరిగా ఇంట్లో ఉన్నపుడు మీరెలా ఉంటారు? ఇది క్వశ్చన్ సింపుల్ కానీ.. ఆన్సర్ మాత్రం చాలా టఫ్. ఎందుకంటే చేసేవన్నీ చెప్పలేరు కొందరు. చెప్పేవన్నీ చేయలేరు మరికొందరు. కానీ ఈ క్వశ్చన్ అడిగి.. తనేం చేస్తుందో ఆన్సర్ కూడా ఇలియానా. ట్విట్టర్ లో ఇల్లీ బేబీ తన ఫ్యాన్స్ ని ఇలా అడిగింది. 'మీ అందరికి నా ప్రశ్న.. మీలో ఒంటరిగా నివశించేది ఎవరు... 'సింగిల్ గా ఉన్నపుడు మీరు చేసే పనుల్లో బెస్ట్ ఏది?' ఇదీ ట్విట్టర్ జనాలకు ఇలియానా వేసిన ప్రశ్న.

దీనికి చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ ఇచ్చారు. కొంతమంది ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో హాయిగా ఉంటామని, బట్టలు ఇస్త్రీ చేయడం నేర్చుకుంటామని, బాత్ రూమ్ లో పాటల పాండిత్యం ప్రదర్శిస్తామని.. ఇలా నానా రకాలుగా తామేం చేస్తామో వివరించారు. అయితే, అందరికంటే చివర్లో ఇలియానా ఆన్సర్ ఇచ్చింది చూడండి.. అది మైండ్ బ్లోయింగ్ అన్నమాటే. 'ఒంటరిగా ఇంట్లో ఉన్నపుడు అర్ధరాత్రి పూట టీవీ ఎదురుగా సోఫాలో కూర్చుని, ఏదో ఒకటి తింటూ ఉండడం నాకిష్టం, అది కూడా అండర్ వేర్ ను మాత్రమే ధరించి'.. ఇది ఇల్లీబేబీ ఇచ్చిన నాటీ ఆన్సర్.

మరి ఇలాంటి హాటీ ఇంత ఓపెన్ గా ఒపీనియన్ చెప్పినపుడు.. అందరికీ  సౌండాఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండర్ వేర్ మాత్రమే వేసుకుని టీవీ ముందు కూర్చుని స్నాక్స్ తింటున్న ఇల్లీని ఊహించుకుని తెగ గిలిగింతలు పెట్టేసుకున్నారు అభిమానులు.
Tags:    

Similar News