వ్యాక్సిన్‌ తీసుకున్న గంగవ్వకు అనారోగ్యం

Update: 2021-04-01 03:53 GMT
మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా జనాలకు పరిచయం అయిన గంగవ్వ తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగవ్వ వరుసగా సినిమాల్లో కూడా నటిస్తూ సందడి చేస్తుంది. కొత్త సినిమాల విడుదల ఉంటే గంగవ్వ ఇంటర్వ్యూలు వారితో చిట్‌ చాట్‌ లు సరదా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గంగవ్వ ప్రస్తుతం యూట్యూబ్‌ స్టార్‌ అనడంలో సందేహం లేదు. గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో పడ్డ ఓట్లే ఆమె క్రేజ్‌ కు నిదర్శణంగా చెప్పుకోవచ్చు. గంగవ్వ తాజాగా కరోనా వ్యాక్సిన్‌ ను తీసుకున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న సమయంలో కాస్త గందరగోళం సృష్టించినట్లుగా కూడా వైధ్యులు పేర్కొన్నారు. ఆమె భయంతో కాస్త అటు ఇటు కదులుతూ మొత్తుకోవడంతో వ్యాక్సిన్‌ వేసిన వారు ఇబ్బంది పడ్డట్లుగా తెలుస్తోంది. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న గంగవ్వ కు అనారగ్య సమస్యలు వచ్చినట్లుగా చెబుతున్నారు. జ్వరం తో పాటు ఒల్లు నొప్పులు మరియు కాస్త నీరసంగా ఉండటం జరిగిందట. రెండు రోజుల పాటు ఆమెను అనారోగ్య సమస్యలు వేదించాయని.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని గంగవ్వ టీమ్‌ మెంబర్స్‌ చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ గంగవ్వ సందేశాన్ని ఇచ్చింది.
Tags:    

Similar News