ఎటుతేలని భారతీయుడు సీక్వెల్ వివాదం..?

Update: 2021-04-29 17:30 GMT
దక్షిణాది అగ్రదర్శకులలో ఒకరైన శంకర్.. ప్రస్తుతం చేతిలో ఓవైపు భారతీయుడు సీక్వెల్ వివాదం మరోవైపు రాంచరణ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. గతకొన్ని నెలలుగా శంకర్ భారతీయుడు సీక్వెల్ విషయంలో వివాదాలు ఎదుర్కొంటున్నాడు. కమల్ హాసన్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కానీ పలు కారణాల వలన సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇంతవరకు సినిమా మళ్లీ ప్రారంభం అవుతుందా లేకపోతే అంతటితో ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్ - లైకా ప్రొడక్షన్స్ మధ్యలో ఏవో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది.

నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి వివాదాలకు గురవుతూనే ఉంది. మధ్యలో చాలా ప్రమాదాలు కూడా జరగడం వలన సినిమా పూర్తికాలేదు. డైరెక్టర్ శంకర్ కూడా కొంతకాలంగా సినిమాకు దూరంగా ఉంటూ కొత్త సినిమాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలను ప్రకటించాడు. కానీ ఇంతలో ముగిసింది అనుకున్న భారతీయుడు సీక్వల్ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం శంకర్ కు అటు లైకా ప్రొడక్షన్స్ వారికీ హోరాహోరి పోరు జరుగుతుంది. ఇటీవలే సినిమా చేయడానికి అటు శంకర్ ఇటు లైకా సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఇరువురి నుండి సెటిల్మెంట్ కుదరలేదని.. ఇద్దరి తరపున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారట. ప్రస్తుతం తుది నిర్ణయం కోర్టు నుండి రావాల్సి ఉంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా కంప్లీట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News