దక్షిణాది అగ్రదర్శకులలో ఒకరు శంకర్. ఇప్పటివరకు దర్శకుడుగా తక్కువ సినిమాలే చేసాడు కానీ ఆయనకంటూ ఓ రేంజిలో క్రేజ్ దక్కించుకున్నాడు. నిజానికి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్లలో ఒకరుగా శంకర్ కొనసాగుతున్నారు. దర్శకుడుగా కెరీర్ ప్రారంభించి దాదాపు ఇరవై ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ పదేళ్లుగా ఆయన స్థాయిలో హిట్ పడలేదు. 2010లో విడుదలైన రోబో మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ కెరీర్ పరంగా హిట్స్ లేక కిందకి పడిపోతూ వచ్చారు. కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. రోబో తర్వాత 'స్నేహితుడు', విక్రమ్ ఐ, రజినీతో రోబో-2 సినిమాలు తెరకెక్కించాడు. కానీ ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకోలేదు. ఇంతలో వెంటనే భారతీయుడు సీక్వెల్ ప్రకటించాడు.
ఈ సినిమా ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటినుండి సినిమాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. షూటింగ్ దశలో ఉండగానే ప్రమాదాలు జరగడం.. కరోనా రావడం ఇలా పెద్ద సమస్యలే వచ్చిపడ్డాయి. మధ్యలో కరోనా నుండి బయటపడి మళ్లీ సినిమా ప్రారంభం అవుతుందని అనుకుంటే.. సినిమా ఆగిపోయిందని టాక్ వచ్చింది. ప్రస్తుతం అదే సినిమా వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొద్దీరోజుల కిందట శంకర్ రాంచరణ్ తో ఓ సినిమా.. అలాగే రన్వీర్ సింగ్ తో అపరిచితుడు సీక్వెల్ ప్రకటించాడు. ఆ వెంటనే లైకా ప్రొడక్షన్స్ వారు భారతీయుడు మూవీ పూర్తిచేయాలనీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు మీరే తేల్చుకోవాలని చెప్పడంతో చర్చలు జరిగాయి. కానీ విఫలం అవ్వడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వివాదం ఇంకా కోర్టు వద్దే ఉంది. కానీ ఇన్నిరోజులుగా ఈ సినిమా వివాదం జరుగుతున్నా హీరో విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించలేదు. మరి ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి.