సత్యదేవ్.. నిత్యా మీనన్ జంటగా రూపొందిన స్కైలాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1970 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ పీరియాడిక్ డ్రామా కు మంచి టాక్ వచ్చింది. అయితే వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్ లో చూడలేక పోయిన వారు.. చూడాలని ఉన్నా వీలు పడని వారితో పాటు ఓటీటీ ప్రేక్షకులు ఇలా ప్రతి ఒక్కరు కూడా స్కైలాబ్ ను స్ట్రీమింగ్ చేయడం కోసం ఆసక్తిగా ఉన్నారు. డిసెంబర్ 4వ తారీకున విడుదల అయిన ఈ సినిమా ను ఇప్పటికే స్ట్రీమింగ్ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సినిమాలు విడుదల అయిన మూడు నాలుగు వారాలకే ఈ మద్య స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాని స్కైలాబ్ ను మాత్రం ఆరు వారాలకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
నిత్యా మీనన్ ఈ సినిమా లో జర్నలిస్ట్ గా కనిపించింది. సత్యదేవ్ పల్లెటూరు డాక్టర్ గా కనిపించాడు. ఒక సీరియస్ విషయాన్ని చాలా సింపుల్ గా ఆకట్టుకునే కథ మరియు వినోదాత్మక కథనంతో దర్శకుడు విశ్వక్ ఖందేరావ్ తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఒక నిర్మాతగా నిత్యా మీనన్ వ్యవహరించడం విశేషం. సత్యదేవ్ వరుసగా విభిన్నమైన పాత్రలు మరియు కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆయన హీరో అనగానే ప్రేక్షకులు కొత్తదనంను ఆశిస్తున్నారు. కనుక ఈ సినిమాలో కొత్తదనం పుష్కలంగా ఉంది. అందుకే ఈ సినిమా ఓటీటీ లో మంచి ఆధరన దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
స్కైలాబ్ సినిమా ను సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను హక్కులు దక్కించుకున్నారు. ఇందుకు గాను సోనిలివ్ వారు భారీ మొత్తంను నిర్మాతలకు కట్టబెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తో సోని లివ్ తెలుగు లో మరింత పాపులర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా లో నిత్యామీనన్ మరియు సత్యదేవ్ ల మద్య ఉండే సన్నివేశాలు మాత్రమే కాకుండా ఇతర కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ కామెడి సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
Full View Full View Full View