పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో విజువల్ మాయాజాలంతో ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుందని ఇంతకుముందే మేకర్స్ వెల్లడించారు. బ్లూమాట్ గ్రీన్ మాట్ తరహా సన్నివేశాలు వీఎఫ్ ఎక్స్ కి అసాధారణ స్కోప్ ఉండడంతో దాదాపు 200కోట్లు పైగా బడ్జెట్ దీనికే ఖర్చు చేస్తున్నారని ప్రచారమైంది.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు..ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని నాగ్ అశ్విన్ రెగ్యులర్ చిత్రీకరణకు రెడీగా ఉన్నారు. ప్రభాస్ రెడీ అంటే? ఆన్ సెట్స్ కు వెళ్లడానికి నాగ్ అశ్విన్ టీమ్ సిద్దంగా ఉంది. ఈ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? అందుకు ఎంత సమయం పడుతుంది? తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వ్యవహారాలు.. రిలీజ్ ఇలా ప్రతి అంశంలోనూ నాగ్ అశ్విన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. షూటింగ్ కోసమే 200 రోజులు కేటాయించినట్లు సమాచారం. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయమే పడుతుందని సమాచారం.
అయితే వీటన్నింటిపైనా ఒక క్లారిటీ రావాలంటే అక్టోబర్ 23 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజున ప్రభాస్ పుట్టిన రోజు కావునా...ప్రాజెక్ట్ కె కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ యూనిట్ రివీల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ `రాధేశ్యామ్` రిలీజ్ తర్వాత ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. `రాధేశ్యామ్` వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అవుతుంది. అంటే అప్పటివరకూ ప్రాజెక్ట్ కె సెట్స్ కు వెళ్లే అవకాశాలు లేనట్లే. ఇక ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్` చిత్రీకరణ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ తర్వాత డబ్బింగ్ కోసమే ప్రభాస్ సమయం కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` లోనూ ప్రభాస్ నటిస్తున్నారు.
`రాధేశ్యామ్` తర్వాత ప్రభాస్ పూర్తిగా సలార్ షూటింగ్ లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్ట్.కె ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే నటిస్తోంది. అందుకు గాను దీపిక భారీగానే ఛార్జ్ చేస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోందన్న ప్రచారం ఉంది. అన్ని పనులు పూర్తిచేసి 2023 లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇండియా లెవల్లో సత్తా చాటుతుందని దర్శకనిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారట. 2.0 విషయంలో శంకర్ మిస్టేక్స్ ని ఇక్కడ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.
ఈ గ్యాప్ లో దీపిక హాలీవుడ్ వైపు..
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ప్రాజెక్ట్- కె లో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తో పాటు ఓ హాలీవుడ్ మూవీలోనూ దీపిక నటిస్తోంది. `ట్రిపుల్ ఎక్స్` సిరీస్ తో హాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపిక హాలీవుడ్ క్రేజీ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపిక తాజా హాలీవుడ్ చిత్రం పూర్తిగా.. రొమాంటిక్ కామెడీ జానర్ లో ఉండనుంది. ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.
`ప్రాజెక్ట్ -కె` లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ.. నాని లాంటి బిగ్ స్టార్లను సైతం నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మూవీ పూర్తి చేసి దీపిక నేరుగా ప్రాజెక్ట్ కే సెట్స్ లో చేరుతుందట. మరోవైపు ప్రభాస్ `సలార్`.. ఆదిపురుష్ 3డి చిత్రాల షూటింగ్ లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో నాలుగు చిత్రాలకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది.