బ్యాంకాక్ లో కథలు రాయడం.. అక్కడ బీచ్ రిసార్టుల్లో సేదదీరుతూ క్రియేటివిటీకి పదును పెట్టడం స్టార్ డైరెక్టర్ పూరికి అలవాటు. పలువురు కథారచయితల్ని బ్యాంకాక్ పంపించే నిర్మాతలు ఉన్నారు. అయితే ఈసారి ఇదే బాటలో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల బృందం బ్యాంకాక్ లో సిట్టింగ్ వేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. అసలింతకీ అక్కడ మెగా టీమ్ ఏం చేస్తోంది అంటే ఆసక్తికర సంగతి తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే చిరు - కొరటాల బృందం బ్యాంకాక్ వెళ్లారట. అక్కడ మెలోడి బ్రహ్మ మణిశర్మతో కలిసి సిట్టింగ్ లో బిజీబిజీగా ఉన్నారని తెలిసింది. అక్కడ బీచ్ పరిసరాల్లో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట.
చిరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తన ఇమేజ్ కి.. పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అయ్యేదిగా ఉండాలని భావిస్తున్నారట. అందుకు తగ్గ కథాంశాన్నే కొరటాల ఎంపిక చేసుకున్నారు. ఇదో సోషియో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. గుడులు గోపురాలు వాటి పాలక మండళ్ల పరిధిలో స్కామ్ లపై దృష్టి సారించిన కొరటాల అదిరిపోయే థీమ్ ని ఎంచుకున్నారట. అందుకు తగ్గట్టే ఇందులో మసాలా అంశాల్ని దట్టించారు. ఫైట్స్ .. సాంగ్స్ ..డ్యాన్సులు.. డైలాగ్స్ ఇలా ప్రతిదానికి ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడ్డారట. ముఖ్యంగా చిరు క్యారెక్టరైజేషన్ లో హీరోయిజాన్ని పీక్స్ లో ఎలివేట్ చేయడమే ధ్యేయంగా ఏడాది కాలంగా ఈ స్క్రిప్టు ను చెక్కారట. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలని భావిస్తున్నారు.