చరణ్ కు అతను సూట్ అవుతాడా ?

Update: 2019-04-23 08:45 GMT
జెర్సీ ఏ స్థాయి విజయమో అన్నది పక్కన పెడితే దర్శకుడు గౌతం తిన్ననూరి అందరికి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇతన్ని బ్లాక్ చేసుకునేందుకు అగ్ర నిర్మాతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. కొద్దిసేపటి క్రితం దిల్ రాజు వరుణ్ తేజ్ కాంబో కోసం గౌతం ఓ స్టొరీ రెడీ చేశాడని టాక్ వచ్చింది. అది ఇంకా ఖరారు కాకుండానే ఎన్వి ప్రసాద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా గౌతం ఓ పీరియాడిక్ డ్రామా చెప్పబోతున్నాడన్న ప్రచారం మొదలైంది.

ఇందులో ఏది ఖచ్చితమైన నిజమని చెప్పడానికి లేదు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూట్ నుంచి గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం కొత్త కథలు వినే మూడ్ లో లేడని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. ఎలాగూ రాజమౌళి చేతిలో డిసెంబర్ దాకా బ్లాక్ అయిపోతా కాబట్టి అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు

దాని సంగతి అలా ఉంచితే గౌతం తిన్ననూరిలో ఉన్న సెన్సిబులిటీస్ చరణ్ ఇమేజ్ కు ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతాయన్నది అనుమానమే. గతంలో ఇలాగే బొమ్మరిల్లు భాస్కర్ కు అవకాశం ఇచ్చిన చరణ్ ఆరంజ్ రూపంలో పెద్ద షాకే తిన్నాడు. తర్వాత మళ్ళి మాస్ రూట్లోకి వచ్చేసి వాటి జోలికి వెళ్ళలేదు.

మళ్ళి రావా-జెర్సీలను గమనిస్తే గౌతం ఎమోషన్స్ ని అద్భుతంగా డీల్ చేసిన విధానాన్ని గమనించవచ్చు. కాని అలాంటివి రామ్ చరణ్ లాంటి వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో మీద నడిపించలేం. అందుకే గౌతం చరణ్ ల కాంబో కార్యరూపం దాల్చడం అంత ఈజీ కాకపోవచ్చు. పైపెచ్చు వరుణ్ తేజ్ కు ఆ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఫిదాతో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. నాకిప్పుడు రెస్ట్ కావాలి అని గౌతం స్వయంగా చెప్పేశాడు కాబట్టి క్లారిటీ వచ్చేందుకు టైం పడుతుంది. సో అన్నయ్య చరణా లేక తమ్ముడు వరుణా తేలేది అప్పుడే
    

Tags:    

Similar News