తన సినిమాల గురించి ప్రేక్షకులు ఎంత దుమ్మెత్తి పోసినా పదే పదే తాను అనుకున్న వాటిని తీస్తూ పోయే రామ్ గోపాల్ వర్మకు మరీ ఘన విజయం కాదు కానీ ఓ మోస్తరు ఫలితం అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో దక్కింది. అది కూడా వివాదాస్పద కథాంశం కావడంతో ఆ మాత్రం బజ్ వచ్చి బిజినెస్ చేసింది కానీ లేకపోతే కథ ఇంకోలా ఉండేది.
తాజాగా తాను ఒక ముఖ్య పాత్రలో ఓ గ్యాంగ్ స్టర్ కథను కోబ్రాగా తీయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణిని ఎంచుకోవడం మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్న కీరవాణి కోబ్రాలో అంత స్పెషల్ ఏం ఫీలయ్యారబ్బా అంటూ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంతకు ముందు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియోకు కంపోజ్ చేసింది కీరవాణినే
ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మ్యూజిక్ కంపోజ్ చేసింది కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్. సరే దానికి ఆఫర్ ఇచ్చాను కదా అని వర్మ మరోసారి కళ్యాణి మాలిక్ కు కోబ్రా ఇవ్వలేదు. అన్నయ్య కీరవాణిని లైన్ లోకి తీసుకున్నాడు. అంటే ఒకటి అన్నకు మరొకటి తమ్ముడికి అన్నట్టు స్కీం ని అమలుపరుస్తున్నాడన్నా మాట.
కీరవాణి స్థాయిలో కాకపోయినా కళ్యాణి మాలిక్ కు కూడా సంగీత పరంగా మంచి పేరు ఉంది. ట్యూన్స్ లో వైవిధ్యం చూపిస్తారనే మార్క్ ఉంది. ఇప్పుడీ ఇద్దరు కలిసి వర్మ సినిమాలకు వర్క్ చేస్తూ పోతే వాళ్ళ స్థాయి ఆల్బమ్స్ రావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీరవాణి వర్మ కాంబోలో ఇప్పటిదాకా ఒక్క క్షణక్షణం మాత్రమే మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది