ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. అతి త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్యామ్ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు కూడా ఇదే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాగా సలార్ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా మొదలు అయ్యింది.
ఇక సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాను కూడా ప్రభాస్ మొదలు పెట్టాల్సి ఉంది. ఇన్ని సినిమాల నడుమ.. అది కూడా భారీ చిత్రాల నడుమ ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాను చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు. ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహించబోతున్నాడు. పక్కా కమర్షియల్ సినిమాను ప్రస్తుతం గోపీచంద్ తో తెరకెక్కిస్తున్న మారుతి త్వరలోనే ప్రభాస్ తో సినిమాను చేసేందుకు మరో వైపు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.
మారుతి సినిమాకు ప్రభాస్ 40 నుండి 50 రోజుల సమయం కేటాయించబోతున్నాడని అంటున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సినిమాను మారుతి ముగించేస్తాను అన్నట్లుగా ధీమాతో ఉన్నాడట. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాని బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా స్పీడ్ గా సాగిపోతుంది. తాజాగా ఈ జెట్ స్పీడ్ సినిమాకు హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
తమిళంలో సూపర్ స్టార్స్ రజినీకాంత్ మరియు విజయ్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు గత కొన్ని రోజులుగా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క ఫోటోలో కూడా అందాల ఆరబోత పీక్స్ అన్నట్లుగా ఉంది. ఆ అందాల ఆరబోత కారణంగానే ఈమెకు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చిందేమో.
సినిమా కన్ఫర్మ్ ఇప్పటి వరకు కాలేదు.. ఎప్పటికి కన్ఫర్మేషన్ ఇస్తారో కూడా తెలియదు. సినిమాను అధికారికంగా ప్రకటించకుండానే ఇలా హీరోయిన్ ను కూడా ఎంపిక చేయడం చాలా అరుదైన సందర్బాల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. పెద్ద హీరోల సినిమాలకు అది కూడా ప్రభాస్ స్థాయి సినిమాలకు ప్రతి మూమెంట్ కూడా అత్యంత కీలకం. కనుక మొదట సినిమాను అనౌన్స్ చేసిన తర్వాతే ఇతర విషయాల్లో ముందుకు వెళ్తారు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలకు పూర్తి విరుద్దంగా ఉండటం మాత్రమే కాకుండా మేకింగ్ విషయంలో కూడా అంతా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ ఇది కేవలం ఒక ప్రయోగం అన్నట్లుగా చేయబోతున్నాడని అంటున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రభాస్ ను సరికొత్తగా ప్రేక్షకులను చూపించే ఉద్దేశ్యంతో ఈ సినిమాను వారు చేయబోతున్నారట.
ఇదే ఏడాదిలో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమా కోసం ఇటీవలే దానయ్య రాజా డీలక్స్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇవన్నీ విషయాలకు క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.