ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓవ‌ర్ గా రియాక్ట్ అవుతున్నారా?

Update: 2022-04-19 16:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన చిత్రం 'ట్రిపుల్ ఆర్' విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయి దాదాపుగా నాలుగు వారాలు కావ‌స్తోంది. అయినా స‌రే ఈ మూవీ ఇప్ప‌టికీ వార్త‌ల్లో నిలుస్తోంది. రిలీజ్ స‌మ‌యంలో ఓ విధంగా వార్త‌లలో నిలిస్తే రిలీజ్ త‌రువాత రికార్డుల ప‌రంగా వార్త‌ల్లో నిలిచింది. అయితే తాజాగా ఈ మూవీ మ‌రో విధంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సినిమా ర‌ణ్ టైమ్ 187 నిమిషాలు. అంటే మూడు గంట‌ల 7 నిమిషాలు అన్న‌మాట‌. ఇంత నిడివితో రాజ‌మౌళి సినిమా ఎప్పుడు రాలేదు. బాహుబ‌లి ర‌న్ టైమ్ 2 గంట‌ల 39 నిమిషాలు. ఇక బాహుబ‌లి 2 ర‌న్ టైమ్ 2 గంట‌ల 47 నిమిషాలు. కానీ 'ట్రిపుల్ ఆర్' ర‌న్ టైమ్ మాత్రం 3 గంట‌ల 7 నిమిషాలు. అయితే కీల‌క స‌న్నివేశాల‌ని తొల‌గించేశారు. నిడివి మ‌రీ ఎక్కువ అవుతోంద‌ని భావించిన మేక‌ర్స్ చాలా సీన్ ల‌కు క‌త్తెరేశారు. ఇవే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారాయి.

'ట్రిపుల్ ఆర్' లో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన ఓ న‌టుడు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ని హై రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఓ సీన్ రూపొందించార‌ని, ఆ సీన్ ఫైన‌ల్ క‌ట్ లో లేపేశార‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. సినిమాలోని ఓ కీల‌క ఘ‌ట్టంలో ఎన్టీఆర్ ని జైల్లో వేసే సీన్ ఒక‌టి వుంటుంద‌ని, అంతా భీమ్ ద‌గ్గ‌రికి వెళ్లి మీరే మా నాయ‌కుడుగా వుండాల‌ని వేడుకుంటార‌ని. ఇది సినిమాలో ఓ అద్భుత‌మైన సీన్‌. అయితే నిడివి కార‌ణంగా ఈ సీన్ ని తొల‌గించార‌ని స‌ద‌రు న‌టుడు స్ప‌ష్టం చేశాడు.

న‌టుడు చెప్పిన ఈ మాట‌ల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు రాజ‌మౌళిపై కామెంట్ లు చేస్తున్నార‌ట‌. కావాల‌నే మా హీరోని జ‌క్క‌న్న తొక్కేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ట‌. అయితే ఇక్క‌డో విష‌యం గ‌మ‌నించాలి. సినిమా గ‌మ‌నాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దుఉ హీరోల‌కు సంబంధించిన సీన్ ల‌ని జ‌క్క‌న్న తొల‌గించారే కానీ ఏ ఒక్క హీరోకు సంబంధించిన స‌న్నివేశాల‌ని కావాల‌ని తొల‌గించ‌లేద‌ని, ఇది ఫ్యాన్స్ గ‌మ‌నించాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే ఇవేవీ గ‌మ‌నించ‌కుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్ర‌తీ విష‌యంలోనూ ఓవ‌ర్ గా స్పందిస్తున్నార‌ని, ప్ర‌తీ విష‌యాన్ని పాయింట్ అవుట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేస్తున్నార‌ని.

ఇది మంది ప‌ద్ద‌తి కాద‌ని, రాజ‌మౌళి ఏ ఒక్క హీరో కు సంబంధించిన సీన్ ల‌ని ఉద్దేశ పూర్వ‌కంగా తొల‌గించ‌లేద‌ని ఇండ‌స్ట్రీలోని ఓ వ‌ర్గం చెబుతోంది. ఇదిలా వుంటే నిడివి కార‌ణంగా తొల‌గించిన స‌న్నివేశాల‌ని ఓటీటీలో విడుద‌ల చేసే అవ‌కాశం వుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ కొంత మంది మాత్రం ఆ స‌న్నివేశాల‌ని మ‌ళ్లీ రీ ఎడిట్ చేసి రిలీజ్ చేసేంత ఓపిక‌, టైమ్ జ‌క్క‌న్న‌కు లేద‌ని, అవి బ‌య‌టికి రావ‌డం ఇక క‌ష్ట‌మేన‌ని మ‌రి కొంత మంది అంటున్నారు.
Tags:    

Similar News