బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వరుసగా ఫ్లాప్స్ కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఆయన తదుపరి చిత్రం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. చివరకు ఆయన తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు అట్లీ ఏర్పాట్లు చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ ఈ సీజన్ పూర్తి అయిన వెంటనే షారుఖ్ షూటింగ్ కు వెళ్లాలని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఒక హిట్ సెంటమెంట్ ను ఫాలో అవుతున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు సూపర్ స్టార్ విజయ్ తో చేసిన సినిమాల్లో హీరో డబుల్ రోల్ ట్రిపుల్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాలు అన్ని కూడా మంచి సక్సెస్ ను దక్కించుకున్నాయి. అందుకే షారుఖ్ ను కూడా రెండు పాత్రల్లో చూపించాలని దర్శకుడు అట్లీ భావిస్తున్నాడట. షారుఖ్ గతంలో చాలా సార్లు డబుల్ రోల్ లో నటించాడు. అయితే ఈసారి మాత్రం అట్లీ సెంటిమెంట్ తో చేయిస్తున్న కారణంగా ఖచ్చితంగా సక్సెస్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ కు విడుదల చేసే అవకాశాలున్నాయట. త్వరలో ఈ సినిమా పూర్తి వివరాలను అధికారికంగా వెళ్లడించనున్నారు.