పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ మూవీకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి. సాహో లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. లాక్ డౌన్ ముందే యూరప్ షెడ్యూల్‌ను ముగించుకున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. 1960 కాలం నాటి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు తప్పకుండా ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ ధీమాతో ఉన్నారట. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ హిందీతో పాటు ఇతర బాషలలో విడుదల కానుంది.
అన్నీ ఉన్నా ఇంతవరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ కాలేదు. మొదటగా ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తారని అన్నారు కానీ కాదని ఆయనే అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారని ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెహమాన్ పెద్దగా ఇంటరెస్ట్ చూపట్లేదని సమాచారం. ఒకవేళ ఏఆర్ రెహమాన్ నో అంటే.. తమన్ కి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. తమన్ ఈమధ్య బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇదే గనక నిజమైతే తమన్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది. అంతేగాక ప్రభాస్ - తమన్ కాంబినేషన్లో ఇదే మొదటి కొలాబరేషన్. మరి తమన్ పాన్ ఇండియా మూవీ అనేది ఏఆర్ రెహమాన్ పై ఆధారపడి ఉందని నెటిజన్లు అంటున్నారు.