RED కి స్ఫూర్తి ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమానా?

Update: 2019-10-31 05:50 GMT
రామ్ క‌థానాయ‌కుడిగా RED చిత్రం ఈ బుధ‌వారం హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. నేను శైల‌జ లాంటి క్లాసిక్ హిట్ ని రామ్ కి అందించిన కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ద‌ర్శ‌కుడు త‌న శైలికి భిన్నంగా ఆలోచించి చేస్తున్న చిత్ర‌మిది. రామ్ ప‌క్కా మాస్ యాక్ష‌న్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే అత‌డి యాటిట్యూడ్ లో స్టైలిష్ ఎప్రోచ్ క్లాసీ ట‌చ్ ఉంటుంద‌ని తెలిసింది.

అయితే రెడ్ సినిమాకి స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే .. 2019లోనే త‌మిళంలో రిలీజై విజ‌యం సాధించిన 'త‌డ‌మ్'కి ఇది రీమేక్ అన్న ప్ర‌చారం సాగుతోంది. సాహో విల‌న్ అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'త‌డ‌మ్'. రియ‌ల్ లైఫ్ క్రైమ్స్ ఆధారంగా తెర‌కెక్కింది. ఇందులో క‌థానాయ‌కుడిని ట్విన్స్ అని అనుమానించి ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డం వ‌గైరా థ్రిల్ ని క‌లిగిస్తాయిట‌. ఐడెంటిక‌ల్ ట్విన్స్ అనే కొత్త పాయింట్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. బెంజ్ కార్ లో తిరిగే ఒక రియ‌ల్ట‌ర్ కం అప్ప‌ర్ మిడిల్ క్లాస్ కి చెందిన కుర్రాడు సినీజ‌ర్న‌లిస్టుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలోనే స్మ‌గ్ల‌ర్ల రంగ ప్ర‌వేశంతో క‌థానాయ‌కుడి విష‌యంలో ఏం జ‌రిగింది? త‌ర్వాత థ్రిల్ ఏమిటి? అన్న‌దే సినిమా. మ‌గిజ్ తిరుమేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇక RED అన‌గానే హాలీవుడ్ స్టార్ బ్రూస్ విల్లీస్ న‌టించిన సినిమా గుర్తుకు వ‌స్తుంది. అమెరికా సీఐఐ .. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేప‌థ్యంలో స్టైలిష్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. గ‌న్స్ తో కొన్ని గ్రూప్స్ మ‌ధ్య వార్ ర‌క్తి క‌ట్టిస్తుంది. మొత్తానికి కిషోర్ తిరుమ‌ల ఎంచుకున్న నేప‌థ్యం ఏది? అన్న‌ది ఉత్కంఠ పెంచుతోంది. బ్రెయిన్ లో చిప్ అన్న కొత్త కాన్సెప్టుతో ఇస్మార్ట్ శంక‌ర్ లో న‌టించిన రామ్ మ‌రో ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టునే ఎంచుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక రెడ్ సినిమాని గుడ్ ఫ్రైడే సెల‌వు లాంగ్ వీకెండ్ చూసుకుని ప‌క్కాగా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ ని మిస్ చేసుకున్న‌ స్ర‌వంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Full View
Tags:    

Similar News