సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ఉపశీర్షిక. పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (ధర్మ ప్రొడక్షన్స్) నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశానికి తల్లీ కొడుకుల సెటిమెంట్ ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్ తో పాటుగా మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా చిత్రానికి ''లైగర్'' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో అనేక స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి 'లైగర్' అనేది మగ సింహం మరియు ఆడ పులి కి పుట్టిన సంకరజాతి జంతువు. ఈ హైబ్రిడ్ జంతువు చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులు వేర్వేరు మాటలకు చెందిన వారిని.. అందుకే వారికి పుట్టిన బిడ్డ రేర్ టాలెంట్ ని కలిగి ఉంటాడని అర్థం వచ్చేలా ఈ టైటిల్ ని పెట్టారని అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా పులి - సింహం ఫోటోలను బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తూ విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్ ని చూపించిన సంగతి తెలిసిందే.
అలానే 'లైగర్' చిత్రంలో హీరోకి నత్తి ఉంటుందని.. 'ట' శబ్ధం పలకడం రాని ఓ బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ.. 'టైగర్' ని 'లైగర్' అని పలుకుతాడని.. ఇవన్నీ కలిసి వచ్చేలా అదే టైటిల్ ని పూరీ ఖరారు చేసారని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఈ టైటిల్ మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో కూడా బజ్ క్రియేట్ చేయగలిగింది. మరి సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, ''లైగర్'' పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో కిక్ బాక్సర్ గా కనిపించడానికి రౌడీ హీరో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటి రమ్యకృష్ణ హీరో తల్లి పాత్ర పోషిస్తున్నారు. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మణిశర్మ - తనీష్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ 'లైగర్' కోసం యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి సౌత్ మూవీ ఫస్ట్ లుక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.