కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తొలి సారి తెలుగు డైరెక్టర్, నిర్మాతతో కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ చుట్టూ థియేటర్ల వివాదం అలుముకుంటోంది. విజయ్ తొలి సారి తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి చేస్తున్న తమిళ మూవీ 'వారీసు'. స్టార్ ప్రొడ్యూసర్, కమ్ నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమిళంలో 'వారీసు'గా తెలుగులో 'వారసుడు'గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ నుంచి ఈ మూవీ తమిళ సినిమాగానే ప్రమోట్ అవుతూ వస్తోంది. కారణం హీరో విజయ్ ప్రతీదీ తమిళ వెర్షన్ కు సంబంధించినది రిలీజ్ చేసిన తరువాతే తెలుగు వెర్షన్ కు ప్రాధాన్యతనివ్వాలని సూచించడం వల్లే మొదటి నుంచి మేకర్స్ అదే ఫార్మాట్ ని ఫాలో అవుతూ వస్తున్నారు. అంతే కాకుండా ఆమధ్య టాలీవుడ్ షూటింగ్ ల బంద్ సమయంలోనూ దిల్ రాజు ఇది తమిళ సినిమా అని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదే ఇప్పడు ఈ మూవీకి తెలుగులో రిలీజ్ కి అడ్డంకుల్ని సృష్టిస్తోందని తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 2017లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేదని ఓ నిర్మాత చేసిన అలిగేషన్ కారణంగా ఆ సమయంలో దిల్ రాజు 'డబ్బింగ్ సినిమాలకు దసరా, సంక్రాంతి' సమయాల్లో థియేటర్లకు కేటాయించరాదని, ఈ సమయంలో స్ట్రెయిట్ సినిమాలకు కేటాయించిన తరువాతే డబ్బింగ్ సినిమాల గురించి ఆలోచించాలంటే ఓ స్టేట్ మెంట్ ని పాస్ చేయడం తెలిసిందే.
ఆ స్టేట్ మెంట్ ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' రిలీజ్ కు పెద్ద అడ్డంకిగా మరడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తను ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం సంక్రాంతి సీజన్ లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకూడదని ఫిలిం ఛాంబర్ ఇప్పటికే తీర్మానించేసింది.
ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' సంక్రాంతి బరిలో నివడం కష్టంగా మారిందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే థియేటర్ల అగ్రిమెంట్ చేసుకున్న దిల్ రాజు ఛాంబర్ నిర్ణయానికి కట్టబడతాడా? .. అలా కట్టబడి 'వారసుడు' రిలీజ్ ని వాయిదా వేస్తాడా? అంటే అది జరిగే పనిలా కనిపించడం లేదు.
ఛాంబర్ నిర్ణయం ప్రకారం ఎగ్జిబిటర్లు దిల్ రాజు కు హ్యాండిస్తే మాత్రం 'వారసుడు' రిలీజ్ ని జనవరి 26కు వాయిదా వేయక తప్పదని అంటున్నారు. అయితే ఇక్కడో చిక్కుంది.. తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అయితే ఇక్కడ కూడా అదే టైమ్ కి రిలీజ్ కావాలని విజయ్ కండీషన్ పెడితే దిల్ రాజు వెనక్కి తగ్గే అవకాశం లేదు. దీంతో 'వారసుడు' వల్ల టాలీవుడ్ లో సంక్రాంతికి థియేటర్ల యుద్దం తప్పదని చెబుతున్నారు. ఏం జరగనుందన్నది తెలియాలంటే ఛాంబర్ నిర్ణయంపై దిల్ రాజు స్పందించే దాన్ని బట్టి ఆధారపడి వుంటుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.