ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం గత నెల 25న భారీ స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఇంకా సత్తా చాటుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడంతో ఒక మైలురాయిని పూర్తి చేసింది. జక్కన్న మేకింగ్ తో పాటుగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.., కొమురం భీమ్ గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఈ విజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.
అయితే RRR చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మరో 30 దేశాలలో విడుదల చేబోతున్నట్టు హీరో రామ్ చరణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అక్టోబర్ లో జపాన్ లో విడుదలవుతుందని.. చైనాలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు. చైనా - జపాన్ లు మన సినిమాలకు లాభదాయకమైన మార్కెట్ గా భావిస్తుంటారు.
అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2024 కోట్లు వసూలు చేయగా.. అందులో ఒక్క చైనాలోనే రూ. 1400 కోట్లకు పైగా రాబట్టడం గమనార్హం. అంటే మనదేశంలో వచ్చిన కలెక్షన్ల కంటే రెట్టింపు ఓవర్సీస్ లో వచ్చాయన్నామాట. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఇంటర్నేషన్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఒకవేళ విదేశీ మార్కెట్ లో RRR మంచి ప్రభావం చూపగలిగితే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయడానికి అవకాశం వుంటుంది. కాకపోతే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి 2' సినిమా చైనాలో ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది.
నివేదికల ప్రకారం లాంగ్ రన్ లో 'బాహుబలి 2' మూవీ డ్రాగన్ కంట్రీలో సుమారు రూ. 80 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. అయితే RRRతో చైనాలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే గోల్డెన్ ఛాన్స్ ఉంది.
RRR ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ - ఎన్టీఆర్ తో సహా యూనిట్ మొత్తం రెండు రోజుల పాటు జపాన్ ను చుట్టిరావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే విధంగా చైనాలో కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి చైనీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ కలెక్షన్లలో విపరీతమైన పెరుగుదలను చూడవచ్చు.
భారతీయ సినిమాలన్నీ చైనాలో అద్భుతమైన బాక్సాఫీస్ రన్ కలిగి ఉంటాయని చెప్పలేం. అందుకే చైనీస్ ప్రేక్షకులు RRR సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఇప్పటికే వెస్ట్రన్ ఫిలిం క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించడం కాస్త కలిసొచ్చే అంశం.
RRR థియేటర్లలో విడుదలైన తర్వాత అనేక మంది వెస్ట్రన్ సినీ విమర్శకులు మరియు విదేశీ ప్రేక్షకులు సినిమా గురించి ట్వీట్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిలో పడిందని అనుకోవచ్చు. మరి ఇంటర్నేషన్ రిలీజ్ లో 'ఆర్.ఆర్.ఆర్' మూవీ సాలిడ్ కలెక్షన్స్ అందుకుని టాప్ ప్లేస్ లో నిలుస్తుందేమో చూడాలి.