ఏ సినిమాకైనా థియేట్రికల్ రిలీజైన నెక్స్ట్ రోజు అది ఎంత వసూలు చేసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తుంటాయి. అయితే నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వకీల్ సాబ్' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. కోవిడ్ ప్రభావం కారణంగా కొన్ని చోట్ల షోస్ ఫుల్ కానప్పటికీ మంచి కలెక్షన్స్ వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చిత్ర నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిందని తెలిపారు. అయితే 'వకీల్ సాబ్' డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు వెల్లడించడానికి నిరకరిస్తున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఫిగర్స్ బయటకు చెప్పొద్దని వారిని ఆదేశించడమే దీనికి కారణమని టాక్ నడుస్తోంది.
సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదంటూ 'వకీల్ సాబ్' సినిమా రిలీజుకు ముందు రోజు జీవో జారీ చేశారు. అయితే అప్పటికే పలు చోట్ల పెంచిన ధరలతో టికెట్స్ అమ్మేశారు. ఈ నేపథ్యంలో పెంచిన టికెట్ ధరలను ఫస్ట్ డే కలెక్షన్స్ లో చేర్చాలా లేదా జాయింట్ కలెక్టర్స్ ఆదేశాల ప్రకారం సాధారణ టికెట్ ధరలను మాత్రమే చూపించాలా అనే డైలమా డిస్ట్రిబ్యూటర్స్ లో ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత దిల్ రాజు తాను చెప్పేవరకు వసూళ్ళ వివరాలు ఏమీ వెల్లడించవద్దని కోరినట్లు సమాచారం. అయితే 'వకీల్ సాబ్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా ఫస్ట్ డే రికార్డులను బ్రేక్ చేయకపోవచ్చని ట్రేడ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలావుండగా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు 'వకీల్ సాబ్' టికెట్ రేట్ల విషయంపై ఏపీ హైకోర్టును సంప్రదించారు. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.