రామ్ పోతినేని- లావణ్య త్రిపాఠి- అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చితరం ఉన్నది ఒకటే జిందగీ. శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం 2017 అక్టోబరు 27 న విడుదలైంది. స్రవంతి సినిమాటిక్స్- పిఆర్ సినిమాస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్- కృష్ణ చైతన్య నిర్మించగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
ఈ కథ ఐదుగురు చిన్ననాటి స్నేహితులు అభి ( రామ్ పోతినేని )- వాసు ( శ్రీ విష్ణు )- సాయి ( కిరీటి దామరాజు )- సతీష్ ( ప్రియదర్శి పులికొండ )- కౌశిక్ (కౌశిక్ రాచపూడి) ల కథ. అభి- వాసు ఒకే అమ్మాయి మెడిసిన్ చదువుతున్న మహాలక్ష్మి అకా మహా ( అనుపమ పరమేశ్వరన్ ) తో ప్రేమలో పడినప్పుడు పరిస్థితులు మారుతాయి. ఆమె ఒక క్లాసికల్ సింగర్ అని తెలుసుకున్న తరువాత అభి తన గొంతును గమనించి తన బృందంలో పాడటానికి ఆమెకు అవకాశం ఇస్తాడు. వాసు ఆమెను తల్లిదండ్రుల నుండి అంగీకారం పొందేలా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వమని ప్రోత్సహిస్తాడు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఆపై ఏం జరిగిందన్నదే సినిమా. అభి వర్సెస్ వాసు గొడవలను తెరపై ఎమోషనల్ గా ఆవిష్కరించారు. స్నేహితుల నడుమ కలతలు గొడవలు స్వీట్ మెమరీస్ లవ్ కెరీర్ ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమా సాగుతుంది. అయితే కిషోర్ తిరుమల టేకింగ్ లో ఎక్కడో చిన్నపాటి లోపం ఆడియెన్ ని కొంత నిరాశపరిచింది. దీంతో ఈ సినిమా ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు.
ఏదైతేనేం.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి. తాజాగా మెమరీ లేన్ నుంచి అద్భుతమైన గమ్మత్తయిన ఫోటోలను చిత్రబృందం పంచుకుంది. ఇందులో రామ్ - శ్రీవిష్ణు- లావణ్య- అనుపమ- కిషోర్ తిరుమల శెట్టి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు యువతరంలో వైరల్ గా మారాయి. అన్నట్టు కాలంతో పాటే మరపు. స్నేహితుల నడుమ లవ్ మెమరీస్ వంటి అంశాలు జనరేషన్ తో పాటు మారుతుంటాయి. అందుకే ఉన్నది ఒకటే జిందగీ .. సీక్వెల్ ఏమైనా ఉందా? అన్నది కిశోర్ తిరుమల వెల్లడించాల్సి ఉంటుంది.