సాయితేజ్ న్యూ మూవీ లుక్ ఇదేనా?

Update: 2022-04-26 00:30 GMT
మెగా మేనల్లుడు సాయితేజ్ మ‌ళ్లీ షూటింగ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. 'రిప‌బ్లిక్' రిలీజ్ స‌మ‌యంలో యాక్సిడెంట్ కి గురైన సాయితేజ్ అటుపై కొన్ని నెల‌లు పాటు విశ్రాంతి లోనే ఉన్నారు. పూర్తిగా కొలుకున్న త‌ర్వాత మార్చిలోనే మ‌ళ్లీ కొత్త సినిమా షూటింగ్ కి హాజ‌ర‌వ్వడం మొద‌లు పెట్టారు.  కార్తీక్ దండు అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా సాయితేజ్ రెస్ట్ లో ఉండ‌గానే ప్రారంభమైంది.

అయితే మార్చి తో కోలుకోవ‌డంతో సాయితేజ్ సెట్స్ కు వెళ్ల‌డం ప్రారంభించారు. సాయితేజ్ ని సెట్ లోకి గ్రాండ్ గా వెల్క‌మ్ చేసారు. కారు దిగిన దగ్గర నుంచి ఫస్ట్ షాట్‌ షూట్ చేసే వరకూ మెగా హీరోపై పూలవర్షం కురిపించారు.  లొకేషన్‌కి కారులో వచ్చిన సాయితేజ్‌కి వెల్‌కం బ్యాక్ సాయి తేజ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.  

దానికి  సంబంధించిన  వీడియో నెట్టింట జోరుగా వై ర‌ల్ అయింది. సాయితేజ్ లుక్ సైతం చాలా మారింది. యాక్సిడెంట్ కి ముందు బొద్దుగా ఉండే సాయితేజ్ ఆ ఘ‌ట‌న త‌ర్వాత బాగా స‌న్న‌బ‌డ్డాడు. పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారాడు. తాజాగా తేజ్ కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. సాయితేజ్ పై ఫోటో షూట్ నిర్వ‌హించిన స్టిల్స్ లా కనిపిస్తున్నాయి.

వైట్ ష‌ర్ట్ ధ‌రించి..క‌ళ్ల‌కు న‌ల్ల‌టి అద్దాలు పెట్టుకుని..బీయ‌ర్డ్  లుక్ లో ఆక‌ట్టుకుంటున్నాడు.  హెయిర్ స్టైల్ కొత్త‌గా ట్రై చేసాడు. ముందు భాగంలో హెయిర్ చిన్న‌పాటి రింగులు తిప్పిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. యాక్సిడెంట్ త‌ర్వాత  సాయితేజ్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డం ఇదే ప్ర‌ధ‌మం.

గత నెల‌లో సెట్ పిక్ లీకైన సంగ‌తి తెలిసిందే. సినిమా విష‌యానికి వ‌స్తే థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి  డైరెక్టర్ సుకుమార్  ద‌ర్శకత్వ పర్యవేక్షణ బాధ్య‌త‌లు తీసుకున్నారు.

గ‌తంలో తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన  'ఉప్పెన ' సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకి సుకుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు వ‌హించారు.  ఆ సినిమా స‌క్సెస్ అయింది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి కోరిక మేర‌కు సుకుమార్ ఆ బాధ్య‌త  తీసుకున్న‌ట్లు  తెలుస్తోంది.
Tags:    

Similar News