'సైరా' తర్వాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో పనిచేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. కొరటాల కు 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉండడం.. తొలిసారి మెగా స్టార్ ను డైరెక్ట్ చేస్తుండడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమా టైటిల్ గురించి చాలా రోజుల నుంచి ఊహా గానాలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం 'గోవింద ఆచార్య' అనే టైటిల్ తో ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఆ టైటిల్ గురించి కొరటాల టీమ్ ఇంత వరకూ స్పందించ లేదు. ఇదిలా ఉంటే తాజా గా ఈ సినిమా కు మరో కొత్త టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ పై చిరు చేసే పోరాటం ప్రధానం గా సాగుతుందని.. అందుకే ఈ సినిమా కు డివోషనల్ టచ్ ఉండేలా 'గోవింద హరి గోవింద' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం.
ఈ సినిమా ను వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకుల ముందు కు తీసుకొచ్చేందు కు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అనుకున్నట్టుగా సమ్మర్ కు రిలీజ్ అయితే కొరటాల ఈ ప్రాజెక్టుకు దాదాపు రెండేళ్ళ సమయం వెచ్చించినట్టే లెక్క. ఎందుకంటే కొరటాల లాస్ట్ సినిమా 'భరత్ అనే నేను' 2017 సమ్మర్ రిలీజ్ అయింది. కొరటాల ఓటమి ఎరుగని దర్శకుడే కానీ సినిమా సినిమా కు మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు. అయితే ఈసారి ఆ గ్యాప్ మరీ ఎక్కువయినట్టే.