'అల వైకుంఠపురంలో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి మరో సినిమా రాలేదు. అయితే ఇటీవలె తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో అనౌన్స్ చేశారు. సుమారు పన్నెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కాగా.. 'ఎస్ఎస్ఎమ్బీ 28' వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఫిబ్రవరిలో ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం షురూ కానుంది. ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తిరిగొచ్చిన వెంటనే చిత్రీకరణను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఖరారు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డేను తొలగించి ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
నాని హీరోగా తెరకెక్కిన 'నానిస్ గ్యాంగ్ లీడర్' మూవీతో ప్రియాంక అరుల్ మోహన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శర్వానంద్ సరసన 'శ్రీకారం' మూవీలో నటించింది. కానీ, ఈ చిత్రాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే తమిళంలో శివ కార్తికేయన్ కు జోడీగా 'డాక్టర్', 'డాన్' చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు తమిళంలో పాటు తెలుగులోనూ హిట్ అవ్వడంతో.. ప్రియాంక అరుల్ మోహన్ కు సూపర్ క్రేజ్ దక్కింది.
దాంతో ఆమెకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ నుంచీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక త్రివిక్రమ్ సైతం తన నెక్స్ట్ మూవీలో పూజా హెగ్డే కంటే ప్రియాంక అరుల్ మోహన్ నే బాగా సెట్ అవుతుందని, మహేశ్ బాబు సరసన ఫ్రెష్ గా కనిపిస్తుందని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే పూజా హెగ్డేను తప్పించి ప్రియాంకను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త జోరుగా వైరల్ అవుతోంది.
అయితే త్రివిక్రమ్ పూజా హెగ్డేకు అంత అన్యాయం చేయడని, అసలు ఆమెను తొలగించే అవకాశాలు లేవని, నెట్టింట వైరల్ అవుతున్న వార్త కేవలం పుకారే అంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏది నిజమో తెలియక పూజా హెగ్డే అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.