రౌడీ స్టార్ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా?

Update: 2022-11-28 10:41 GMT
ఇక హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌లు, ప్రాజెక్ట్ లు మ‌రో హీరో త‌లుపు త‌డుతున్న విషయం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టాల‌నుకున్న త్రివిక్ర‌మ్ ఆ త‌రువాత ఎన్టీఆర్ త‌ను చెప్పిన స్టోరీని రిజెక్ట్ చేయ‌డంతో త్రివిక్ర‌మ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ప్రాజెక్ట్ ని ఫైన‌ల్ చేసుకున్న విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ ని ప‌క్క‌న పెట్టిన ఎన్టీఆర్ ఆ స్థానంలో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో భారీ సినిమాకు ఫిక్స‌యిపోయాడు.

ఇక ఎన్టీఆర్ తో చేయాల‌నుకున్న బుచ్చి బాబు తాజాగా రామ్ చ‌ర‌ణ్ కు ఫిక్స‌యిపోవ‌డం.. సోమ‌వారం అధికారికంగా ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌నుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి ఈ ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోవ‌డంతో ఆ స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాకు రెడీ అయిపోయాడు. గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ని రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న పెట్ట‌డంతో యువీ క్రియేష‌న్స్ వారు కూడా డైరెక్ట‌ర్ ని ప‌క్క‌న పెట్టేశారు.

దీంతో గౌత‌మ్ తిన్న‌నూరి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే స్టోరీని న‌రేట్ చేసి ఓకే అనిపించుకున్నాడు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కానీ ఎన్ వీ ప్ర‌సాద్ కానీ నిర్మిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

గ‌త కొంత కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయాల‌ని దిల్ రాజు ఎదురుచూస్తున్నాడు. ఈ నేప‌త్యంలో త‌ను కానీ, లేదా ఎన్ వీ ప్ర‌సాద్ కానీ గౌత‌మ్ తిన్న‌నూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల ప్రాజెక్ట్ ని నిర్మిస్తార‌ని అంతా అనుకున్నారు.

కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ చేతులు మారిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త‌గా ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించే అవ‌కాశాలు వున్నాయ‌ని, త‌న‌తో ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని, ఈ ప్రాజెక్ట్ ని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించాల‌ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసే ప‌నిలో వున్నాడ‌ట‌.

అంతా అనుకున్న‌ట్టుగా పూర్త‌యితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది. అంతే కాకుండా ఇది పాన్ ఇండియా మూవీగా తెర‌పైకి రానున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషీ'. స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నాడు. సామ్ అనారోగ్యం కార‌ణంగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News