దాని కి కొద్ది రోజులు గా దూరంగా ఉంటున్న ..ఇప్పుడు ఎలా ఉందంటే?

Update: 2019-11-12 10:00 GMT
సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరింది. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా కి బాగా అడిక్ట్ అయిపోయారు. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనితో రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా పై ఆధారపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియా ని ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా అయితే ..వీలైనంత ఎక్కువ మంది కి దగ్గర కావచ్చు అనేది వారి అభిప్రాయం. దీనితో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక సోషల్ మీడియా టీం ని ఏర్పాటు చేసుకుంటున్నారు.  ఇక పోతే గత కొన్ని రోజుల వరకు రాహుల్ గాంధీ దగ్గర సోషల్ మీడియా హెడ్ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన పనిచేసేది. ఆ మధ్యన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈమె దాదాపు ఐదేళ్లు గా ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం లో కీలకంగా వ్యవహరించింది. రాజీనామా కి ముందే తన  సొంత సోషల్ మీడియా అకౌంట్‌ ను కూడా ఆమె డిలీట్ చేశారు. ఇలా మొత్తానికి ఆమె సోషల్ మీడియా కు దూరం అవ్వడంతో 'రమ్యా ఎల్లిదియమ్మా' అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. కాగా వీటన్నింటికి తాజాగా సమాధానం ఇచ్చారు రమ్య. సోషల్ మీడియా హెడ్‌గా రాహుల్ గాంధీ తనను నియమించినప్పుడు తానేం పెద్ద అనౌన్స్‌మెంట్ చేయ లేదని .. అలాగే  ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కూడా అలాగే ఉన్నానని తెలిపారు.

ఈ సందర్భం గా తన పెళ్లి  పై వచ్చిన వార్తల పై క్లారిటీ ఇచ్చారు. తాను దుబాయ్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని.. దానికి  ఎందుకు హైప్‌ వచ్చిందో కూడా తనకు అర్థం కాలేదని చెప్పింది. కొన్ని రోజులు గా సోషల్ మీడియా కు దూరంగా ఉంటుండటంతో.. ఆ ఫ్లాట్‌ఫాం లో ఏం జరుగుతుందో కూడా తన కు తెలీదని  చెప్పుకొచ్చారు. ఇక సినిమా ఆఫర్లు కూడా తన కు వస్తున్నాయని, కానీ రాజకీయంగా కొన్ని కమిట్‌మెంట్లు ఉండటం వలన ఏ సినిమా కు ఇంత వరకు ఓకే చెప్ప లేదని ఆమె తెలిపారు. ఇక ఇప్పుడు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి  సిద్ధం గా ఉన్నట్టు తెలిపింది. ఇక భవిష్యత్‌ లో నాకు దేని పైనైనా ఆసక్తి వస్తే అది కచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే సోషల్ మీడియా కు దూరంగా ఉంటూ చాలా సంతోషం గా ఉన్నాను అని రమ్య స్పష్టం చేశారు.
Tags:    

Similar News