ట‌వ‌ల్ చుట్టుకుంది, క‌నిపించ‌డం లే?

Update: 2015-09-15 05:51 GMT
జాకీష్రాప్ త‌న‌యురాలు కృష్ణా ష్రాప్ డేర్ డెవిల్ యాక్ట్ గురించే బాలీవుడ్ కోడై కూస్తోంది.  ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో ఈ అమ్మ‌డి డేర్ అప్పియ‌రెన్స్ ఇటీవ‌లి కాలంలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. జాకీష్రాప్ గారాల ప‌ట్టి టాప్ లెస్ ఫోజుల్లో రెచ్చిపోయింది అంటూ  మీడియా టీఆర్‌ పీ గేమ్ ఆడింది.  ఓ స్టార్ హీరో కూతురు ఇలా ఏ ఆచ్ఛాద‌నా లేకుండా హాట్‌ గా క‌నిపించ‌డ‌మేంటి? అంటూ ప్ర‌త్యేక‌క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీనికి జాకీ అభిమానుల నుంచి ఆవేద‌న వ్య‌క్త‌మైంది. అందుకే ఒకానొక సంద‌ర్భంలో ఇదే ప్ర‌శ్న‌ను జాకీనే అడిగితే ఏం చెప్పాడో తెలుసా?

ఈ స్టార్ హీరో కం న‌టుడు త‌న కూతురినే వెన‌కేసుకొచ్చాడు. కృష్ణ టాప్ లెస్‌ గా క‌నిపించింద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు. త‌న ఫోటోల్ని స‌రిగా ప‌రిశీలించారా? త‌ను ఓ ట‌వ‌ల్ చుట్టుకుని ఉంది. క‌నిపించ‌డం లేదా? అంటూ రివ‌ర్సులో క్లాస్ తీసుకున్నారాయ‌న‌. కృష్ణ న‌టి అవుతుందా? అన్న ప్ర‌శ్న‌కు నాకు అలాంటివేం చెప్ప‌లేదు. టైగ‌ర్ ష్రాప్ కూడా అంతే. త‌ను ఎప్పుడూ హీరో అవుతాన‌ని చెప్ప‌నేలేదు. ఇప్పుడు కృష్ణ కూడా న‌టి అవుతాన‌ని నాతో అన‌లేదు. ప‌రిశ్ర‌మ నాకు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్‌ ని ఇచ్చింది. ప్ర‌తిదీ ఇచ్చింది. అలాగే నా కొడుకుని కూడా వెల్‌క‌మ్ చేసింది. భ‌విష్య‌త్‌ లో ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంది.. అంటూ జాకీ మ‌న‌సులోని మాట చెప్పాడు.

జాకీష్రాప్ హీరోగా రామ్‌ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఊర్మిళ చిత్రాన్ని బాలీవుడ్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేదు. ఆ సినిమాతో జాకీ స్టార్‌ డ‌మ్ మ‌రింత  ఎత్తుకి ఎదిగింది. ఆ ర‌కంగా అత‌డు రామూకి రుణ‌ప‌డి ఉంటాడు ఎప్ప‌టికీ.
Tags:    

Similar News