ఫస్ట్ లుక్: యాత్ర కోసం రాజా రెడ్డి పాత్రలో..

Update: 2019-01-03 07:03 GMT
దివంగత నేత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు రాజకీయాలపై శాశ్వత ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను ప్రధాన ఇతివృత్తంగా తెసుకొని దర్శకుడు మహి వీ రాఘవ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'యాత్ర'.  ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.

ఈ సినిమాలో వైఎస్ ఆర్ నాన్నగారైన వైఎస్ రాజారెడ్డి గారి పాత్రను సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు పోషిస్తున్నాడు.  తాజాగా 'యాత్ర' రాజారెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో జేబీ తళతళలాడే తెల్లటి చొక్కా ధరించి నమస్కారం పెడుతున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. పొడవాటి మీసాలు.. క్లీన్ షేవ్ తో వైఎస్ రాజారెడ్డిని తలపిస్తున్నాడు జగపతి బాబు. చేతికి వాచీ.. వేలికి ఉంగరం.. జేబులో పెన్ను.. ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.  ఈ సినిమాలో రాజారెడ్డి పాత్ర తక్కువసమయమే ఉన్నప్పటికీ జగపతి బాబు లాని నటుడైతేనే ఇంపాక్ట్ ఉంటుందని ఆయనను తీసుకున్నారట.  జగపతి బాబు ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ సినిమాను విజయ్ చిల్లా.. శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News