ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో ప్రమోట్ చేసారో చెప్పాల్సిన పనిలేదు. తొలి ధఫా ప్రచారంలో రామ్ చరణ్-తారక్-రాజమౌళి బాలీవుడ్ బెల్ట్ టార్గెట్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. టెలివిజ్ షోలకి సైతం హాజరయ్యారు. సందర్భం దొరికనప్పుడల్లా ఉత్తరాది జనాలకు `ఆర్ ఆర్ ఆర్` ని నరనరాన ఎక్కించే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో అలియాభట్ కూడా తోడైంది.
ఆ ముగ్గురితోపాటు కొన్ని ఈవెంట్లకు అలియాభట్ కూడా హాజరైంది. కొన్ని రోజుల పాటు ఆ త్రయంతో ట్రావెల్ అయింది. ఆ తర్వాత అనూహ్యంగా రిలీజ్ వాయిదా పడటంతో ఆ ప్రచారమంతా వృద్దా అయింది. దీంతో రెండో ధపా ప్రచారం బాధ్యతల్ని మళ్లీ ఆ ముగ్గురే భుజస్కందాలపై వేసుకుని మోసారు. ఈసారి పడి లేచిన కేరటంలా ఈ త్రయం దేశ వ్యాప్తంగా 'ఆర్ ఆర్ ఆర్' ని ప్రమోట్ చేసింది. రెండో దఫా ప్రచారంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.
హిందీ బెల్డ్ ని పక్కనబెట్టి ఈసారి సౌత్ మార్కెట్ని టార్గెట్ చేసి ప్రచారం చేసారు. ప్రత్యేకంగా ఉత్తరాదిన నెలకొన్న కొన్ని ఫేమస్ టెంపుల్ని సైతం సందర్శించారు. పంజాబ్..ఢిల్లీ టూర్లు వేసి ప్రచారం చేసారు.
మార్గ మధ్యలో ముంబైని టచ్ చేసారు. అదే సమయంలో రానాతో ముంబైలోనే ఓఅపార్ట్ మెంట్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు. ముంబైలో ఇంటర్వ్యూ అయినా ఆప్లేవర్ ఎక్కడా కనిపించలేదు. అందరూ తెలుగు వాళ్లే కావడంతో తెలుగులోనే ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అయింది.
అయితే ఈసారి బాలీవుడ్ నటుల్ని పూర్తిగా పక్కనబెట్టారు. అలియాభట్ గానీ..అజయ్ దేవగణ్ గాని సినిమా ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. ఢిల్లీ ప్రచారంలో మాత్రం అలియాభట్ కనబడి వెళ్లిపోయింది. ఇక అజయ్ దేవగణ్ అయితే సినిమా ప్రచారానికి మొదటి నుంచి దూరంగానే ఉన్నారు. వాస్తవానికి ఇతర బ్యానర్ సినిమాల్లో ప్రచార కార్యక్రమాలకి అజయ్ హాజరు కారు. బాలీవుడ్ లో కూడా ఆయన విధానం అంతే. ముందే ఆవిధంగా అగ్రిమెంట్ ఉంటుంది.
ఆ లెక్కనే `ఆర్ ఆర్ ఆర్` అగ్రిమెంట్ కూడా జరిగి ఉంటుంది. `ఆర్ ఆర్ ఆర్` ప్రచారంలో అజయ్ దేవగణ్ సహా అలియాభట్ కూడా జాయిన్ అయి ఉంటే హిందీలో మంచి రీచ్ దొరికేది. కానీ జక్కన్న ఆ ఛాన్స్ తీసుకోలేదు. జక్కన్నది ఎదుట వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఎవరికీ అతిగా ఛాన్స్ ఇవ్వరు. జక్కన్న దగ్గర అంత చనువుగా మెలిగేది ఒక్క తారక్ మాత్రమే. దీంతో రాజమౌళి అందుబాటులో ఉన్నవారితోనే ప్రచారం పనుల్ని ముగించారు.