ఇండియాస్ నెం.1 షో లో టాలీవుడ్‌ జక్కన్న

Update: 2022-07-23 06:03 GMT
టాలీవుడ్‌ జక్కన్న కి జాతీయ స్థాయి వేదికలు కొత్త కాదు. బాహుబలి సినిమా నుండే ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. దాంతో ఆయన ఇప్పటి వరకు ఎన్నో జాతీయ స్థాయి కార్యక్రమాల్లో.. షో ల్లో పాల్గొన్నాడు. బాలీవుడ్‌ దర్శకులను మించిన క్రేజ్‌ ను దక్కించుకున్న రాజమౌళి ని ఇండియాస్ నెం.1 టాక్ షో కు ఆహ్వానించడం.. జక్కన్న ఓకే చెప్పడం జరిగిందట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ అయిన కరణ్‌ జోహార్ తన టాక్ షో కు గాను రాజమౌళిని ఆహ్వానించాడట. రాజమౌళితో పాటు బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కూడా కరణ్‌ జోహార్‌ ఆహ్వానించాడని బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కరణ్‌ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్ గా ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో సరికొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో సీజన్‌ 7 కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. తాజాగా సమంత మరియు అక్షయ్‌ కుమార్‌ లు కలిసి వచ్చిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవ్వగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

కాఫీ విత్ కరణ్‌ షో లో ఇంకా పలువురు బాలీవుడ్ మరియు సౌత్‌ స్టార్స్ పాల్గొనబోతున్నారు. మొదటి షెడ్యూల్‌ కు సంబంధించిన ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌ పూర్తి అవ్వబోతున్న నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాజమౌళి మరియు సంజయ్‌ లీలా భన్సాలీ లను ఆహ్వానించారని తెలుస్తోంది.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయినా కూడా కరణ్ ఆహ్వానం ను మన్నించి షో కు వెళ్లేందుకు ఓకే చెప్పాడట. కాని సంజయ్ లీలా భన్సాలీ మాత్రం టాక్ షో లో హాజరు అయ్యేందుకు డేట్లు ఖాళీ లేవని చెప్పాడట. ఆయన ప్రస్తుతం ఒక భారీ వెబ్‌ సిరీస్‌ ను చేస్తున్నాడు. ఆ కారణంగానే టాక్ షో లో పాల్గొనలేక పోతున్నాడు.

సంజయ్ లీలా భన్సాలీ కోసం ఇంకా కరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు సౌత్‌ స్టార్ యశ్‌ ఇంకా ప్రశాంత్‌ నీల్ ను కూడా ఈ షో కు ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి. వారు వెళ్తారా అనేది చూడాలి. యశ్‌ కొత్త సినిమా పనుల్లో ఉండగా ప్రశాంత్‌ నీల్‌ సలార్ షూటింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నాడు. అయినా కూడా వీరు టాక్ షో లో పాల్గొంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ లో ఎక్కువగా సౌత్‌ స్టార్స్ ను తీసుకు వచ్చేలా కరణ్‌ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
Tags:    

Similar News