ఆ ఒక్క పాట కోసం జక్కన్న నెల రోజులు..!

Update: 2021-06-01 15:45 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. రెండు నెలల వర్కింగ్‌ డేస్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఒక నెల పూర్తిగా హీరోల ఇంట్రడక్షన్‌ సాంగ్ ఉంటుందని చెబుతున్నారు. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్‌ మామూలుగా ఉండదట. ఇప్పటి వరకు తెలుగు సినిమా స్క్రీన్‌ పై చూడని విజువల్స్ ను జక్కన్న చూపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

సినిమా లోని ఆ ఒక్క పాట కోసం ఏకంగా నెల రోజుల పాటు ఇద్దరు హీరోలను మరియు వందల మంది టెక్నీషియన్స్ మరియు సైడ్ డాన్సర్లను వినియోగించబోతున్నాడట. ఆ ఒక్క పాట కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఆ పాటను విజువల్ వండర్‌ గా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ను ఇప్పటికే వాయిదా వేసినట్లే అంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి లేదా వచ్చే సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

సినిమా విడుదలకు సమయం ఇంకా చాలానే ఉంది. కనుక బ్యాలన్స్ ఉన్న రెండు పాటలతో పాటు ప్యాచ్‌ వర్క్ ను మెల్లగా నే పూర్తి నిర్మాణానంతర కార్యక్రమాలు చేయించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల మద్య వచ్చే ఫైట్‌ కన్నీరు తెప్పిస్తుంది అంటూ ఇటీవల విజయేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇక హీరోల ఇంట్రడక్షన్ పాట అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News