శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ గత ఏడాది హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన `రూహీ` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హార్థిక్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ కీలక పాత్రల్లో నటించారు.
హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది. ఈ మూవీ తరువాత జాన్వీ నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ `గుడ్ లక్ జెర్రీ`. జాన్వీ టైటిల్ పాత్రలో నటించింది.
సిద్ధార్ధ్ సేన్ గుప్త దర్శకత్వం వహించారు. 2018 లో విడుదలైన తమిళ చిత్రం `కొలమావు కోకిల` ఆధారంగా ఈమూవీని రీమేక్ చేశారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని `బీస్ట్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. అయ్యంగరన్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై `2.O` ఫేమ్ అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించారు. తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే మూవీని జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో `గుడ్ లక్ చెర్రీ` పేరుతో రీమేక్ చేశారు.
అయితే ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని శుక్రవారం సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
భయం భయంగా చూస్తూ చేతిలో గన్ పట్టుకుని ఫైరింగ్ కి రెడీగా వున్న యువతిగా జాన్వీ కనిపిస్తున్న తీరు ఇంట్రెస్టింగ్ వుంది. మరో పోస్టర్ లో తెరిచిన టిఫిక్ బాక్స్ ల మధ్య హెడ్ మాత్రమే కనిపిస్తూ భయంతో వణికిపోతున్న యువతిగా జాన్వీ కనిపిస్తున్న తీరు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
అంతే కాకుండా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ఆసక్తికరమైన క్యాప్షన్ ని జతచేసింది జాన్వీ. `కొత్త అడ్వెంచర్ కోసం నేను బయటికి వచ్చాను. నాకు గుడ్ లక్ చెప్పరూ?` అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని పంజాబ్, చండీఘడ్ లలో చిత్రీకరించారట. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ తో కలిసి ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. ఈ మూవీతో అయినా జాన్వీ స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.